News October 2, 2025

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ

image

నెల్లూరు జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా. అజిత వేజెండ్ల విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రజలకు శ్రీ దుర్గా మాత ఆశీస్సులు ఉండాలని, సకల శుభాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆ దుర్గ భవాని ఆశీస్సులు అందరికీ కలగాలని కోరారు.

Similar News

News October 2, 2025

నెల్లూరు: అనుమతులు లేకుండానే ఆక్వా సాగు!

image

ప్రభుత్వ భూముల్లో అనుమతి పత్రాలు లేకుండా 12,734 మంది రైతులు 16,836.84 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. రెవెన్యూ నుంచి NOC లేకుండా ఈతంతు సాగుతోంది. రీసర్వే జరగని కారణంగా 8678.56 ఎకరాలకు చెందిన 4174 మంది తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి LPM నంబర్లు తప్పనిసరిగా ఉంది. మరోవైపు ఈనెల 20వ తేదీలోగా మత్స్యశాఖ నుంచి లైసెన్స్‌లు పొందాలని ఫిషరీస్ JD శాంతి తెలిపారు. దీంతో విద్యుత్ రాయితీలు పొందవచ్చన్నారు.

News October 2, 2025

నెల్లూరు: రొయ్య రైతుల్లో మళ్లీ చిగురిస్తున్న ఆశలు!

image

అమెరికా టారిఫ్స్ తో జిల్లాలో కుదేలైన అక్వా రంగంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రొయ్య సాగు రైతుల్లో ఏర్పడిన అలజడి నెమ్మదిగా సద్దుమణుగుతుంది. రొయ్యల ఎగుమతుల ప్రత్యామ్నాయాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టడంతో 10% ఉన్న రష్యా ఆర్డర్ 40% పెరిగిందని సమాచారం. తాజాగా యూరప్ దేశాల నుంచి ఆర్డర్లు రావడం కూడా రైతులలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని ఎగుమతిదారులు చెబుతున్నారు.

News October 2, 2025

నెల్లూరు: తగ్గనున్న విద్యుత్ చార్జీలు

image

ఎన్నికల వేళ విద్యుత్తు బిల్లులు పెంచబోమని ఇచ్చిన హామీని కూటమి నేతలు నిలబెట్టుకున్నారు. తాజాగా ట్రూ డౌన్ సమీక్షలో జిల్లా వినియోగదారులపై రూ.32 కోట్లు భారం తగ్గనుంది. జిల్లాలో 12,37,429 కనెక్షన్లు ఉండగా రోజుకు సుమారు 13 మిలియన్ యూనిట్లు వినియోగమవుతున్నాయి. గతంలో యూనిట్‌కు అదనంగా 40 పైసలు వసూలు చేసిన చోట, ఇకపై 13 పైసలు తగ్గింపు లభించనుంది. నవంబరు బిల్లుల నుంచే అమలు జరగనుందని SE కే.రాఘవేంద్ర తెలిపారు.