News April 6, 2024
HYD: వామ్మో ఎండ.. AC బస్సుల్లో రద్దీ

HYDలో ఎండ దంచి కొడుతోంది. దీంతో నగరంలో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొందరు మహిళలు సైతం పైసలైనా సరే.. ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య వేసవి వేళ పెరుగుతోంది. మరికొంత మంది ప్రయాణికులు మెట్రోను సైతం ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులతో అటు మెట్రో, ఇటు ఏసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి.
Similar News
News July 6, 2025
GHMC: అసలు మనకెన్ని ఆస్తులున్నాయి..?

GHMCకి అసలు స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయో అధికారులకు అంతుపట్టడం లేదు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఆస్తులను సర్వే చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ మేరకు సర్వే చేయడానికి కన్సల్టెంట్లను టెండర్లకు ఆహ్వానించారు. నాలుగు జోన్లలో దాదాపు 1400 స్థిరాస్తులు ఉన్నాయని రికార్డుల్లో ఉంది. ఎక్కడెక్కడ, ఏఏ ఆస్తులు ఉన్నాయో త్వరలో సర్వే చేసి మొత్తం ఆస్తి వివరాలు తెలుసుకోనున్నారు.
News July 6, 2025
MNJ కేన్సర్ ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు

MNJ కేన్సర్ ఆస్పత్రిలో ఇక మెరుగైన వైద్య సేవలందనున్నాయి. ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయిస్తూ మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ కేన్సర్ బాధితులు పెరిగిపోతుండటంతో లక్డీకపూల్(రెడ్ హిల్స్)లో ఉన్న MNJలో పేషెంట్లు చికిత్సకు ఇబ్బందులు ఏర్పడకుండా బోర్డు వీరిని నియమించింది.
News July 6, 2025
మహిళల రక్షణ కోసం ‘SWAT’ బృందం

HYD నగర పోలీసులు మహిళల భద్రత, నిరసన ప్రదర్శనల నిర్వహణ కోసం 35 మంది మహిళా పోలీసులతో “స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్(SWAT)”ను ప్రారంభించారు. కరాటే, నిరాయుధ పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ బృందం ధర్నాలు, ర్యాలీలు, ముఖ్యమైన ఈవెంట్లు, పండుగల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తుంది. సరికొత్త యూనిఫాంలో సచివాలయం వద్ద విధుల్లో చేరిన ఈ బృందం.. మహిళల ఆందోళనలు నియంత్రించడంలో కీలకపాత్ర పోషించనుంది.