News October 2, 2025
నెల్లూరు: ప్రమాదం అంచున బాలికలు!

కౌమార బాలికల్లో రక్త హీనత వేధిస్తుంది. జిల్లా వ్యాప్తంగా31,242 మందికి ఈ ఏడాది జూన్ నుంచి sep వరకు హీమోమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. 22,538 మందికి HB వాల్యూ నార్మల్ గా ఉంది. కాగా MILD ANEMIA 6418, MODERATE ANEMIA 2256, SEVERE ANEMIA 30 మంది చొప్పున బాధపడుతున్నారు. జిల్లాలో 8704 మంది కౌమార బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉందనేది అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
Similar News
News November 5, 2025
NLR: జనసేనలో విబేధాలపై రహస్య విచారణ

నెల్లూరు జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాకు MSME ఛైర్మన్ శివ శంకర్ వచ్చారు. రెండు రోజుల పాటు నేతలతో విడివిడిగా మాట్లాడారు. నివేదికను జనసేనానికి అందివ్వనున్నారు. జనసేనాని జోక్యంతో నేతల్లో ఉన్న అసంతృప్తి జ్వాల చల్లారుతుందో లేదో చూడాలి.
News November 5, 2025
లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా

20 అంశాల కార్యక్రమ అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆయన బుధవారం జిల్లాలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, సాయంత్రం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అనివార్య కారణాలవల్ల ఈ పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News November 5, 2025
నెల్లూరులో మహిళ హత్య.?

నెల్లూరులోని వనంతోపు సెంటర్ సమీపంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో పడేసి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహం ఆస్తి పంజరంగా మారిపోవడంతో నెల రోజుల కిందట ఈ ఘటన జరిగి ఉంటుందని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు.


