News October 2, 2025
NLG: పకడ్బందీగా కోడ్ అమలు.. నగదు తరలింపు పై దృష్టి!

స్థానిక సంస్థలకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది. జిల్లాలో కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నగదు తరలింపుపై దృష్టి సారించింది. MPTC, ZPTC, సర్పంచ్ స్థానాలకు పోటీ చేయాలని భావించే ఆశావహులు, వారి బంధుమిత్రులపై నిఘా ఉంచింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున వారి రాక పోకలు సహా బ్యాంక్ అకౌంట్లపై దృష్టి పెట్టింది. తనిఖీల్లో రూ.50 వేలకు మించి నగదు దొరికితే స్వాధీనం చేసుకోనున్నారు.
Similar News
News November 1, 2025
మూగజీవాలకు కష్టాలు.. నట్టల మందుల సరఫరా నిలిపివేత

నల్గొండ జిల్లాలో గత రెండేళ్లుగా పశుసంవర్ధక శాఖ మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో కాపరులు ప్రైవేటుపై ఆధారపడుతున్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల గొర్రెలు, 2 లక్షల మేకలు ఉన్నట్లు అంచనా. స్టాక్ త్వరలో వస్తుందని, అందిన వెంటనే పంపిణీ చేస్తామని ఏడీ రమేష్ బాబు తెలిపారు.
News November 1, 2025
చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారు!

జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. జిల్లాకు 5.98 కోట్ల చేప పిల్లలు కావాలని మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈనెల రెండో తేదీన నకిరేకల్ పట్టణంలోని పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో సుమారుగా 60 వేల మంది మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా లబ్ధి చేకూరనుంది.
News November 1, 2025
జిఎన్ఎం కోర్సులో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జనరల్ నర్సింగ్, మిడ్ వైపరీ (జీఎన్ఎం) 3 సంవత్సరాల శిక్షణ కోర్సులో ప్రవేశానికి అర్హత గల పురుష, మహిళా అభ్యర్థుల నుంచి నవంబరు 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా వైద్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు డిఎంహెచ్వో కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.


