News April 6, 2024
పింక్ జెర్సీలతో బరిలోకి

కాసేపట్లో ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ పూర్తి పింక్ జెర్సీలో బరిలోకి దిగనుంది. మహిళల సాధికారత, అభ్యున్నతే లక్ష్యంగా #PinkPromise మిషన్ కింద రాజస్థాన్ ఈ మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ మ్యాచ్కు విక్రయించే ప్రతి టికెట్ నుంచి రూ.100 మహిళల అభివృద్ధికి విరాళంగా ఇవ్వనున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్లో ప్రతి సిక్స్కి రాజస్థాన్లోని ఆరు ఇళ్లకు సౌరశక్తిని అందించనున్నారు.
Similar News
News January 14, 2026
‘భూ భారతి’ స్కామ్లో అధికారుల పాత్ర!

TG: భూ భారతి చలాన్ల దుర్వినియోగం కేసులో అధికారుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. RR, యాదాద్రి జిల్లాల్లోనే భారీగా అవినీతి జరగగా అక్రమార్కులతో తహశీల్దార్లు కుమ్మక్కయ్యారనే అనుమానాలున్నాయి. రూ.కోట్ల విలువైన భూములకు రూ.లక్షల్లో స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉండగా 40-50 రూపాయలే చలాన్ కట్టి మిగతా సొమ్మును కాజేశారు. కాగా ఈ భాగోతం బయటపడటంతో ప్రభుత్వం పోర్టల్లో ఇంటర్ఫేజ్ వ్యవస్థను బలోపేతం చేసింది.
News January 14, 2026
తల్లి బాటలోనే కుమారుల పయనం

2011లో కేవలం 10, 12 పశువులతో మణిబెన్ జేసుంగ్ చౌదరి పాల ఉత్పత్తి ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు బన్నీ, మెహ్సాని, ముర్రా గేదెలు, హెచ్ఎఫ్ ఆవులు, స్వదేశీ కంక్రేజ్ జాతులు ఆమె డెయిరీలో ఉన్నాయి. మణిబెన్ ముగ్గురు కుమారులు గ్రాడ్యుయేట్లు అయినప్పటికీ.. వారు పూర్తిగా ఈ పాడి పరిశ్రమలోనే పనిచేస్తున్నారు. ఆధునిక మిల్కింగ్ యంత్రాల సహాయంతో ఆవులు, గేదెలకు పాలు పితుకుతూ తల్లికి తోడుగా నిలుస్తున్నారు.
News January 14, 2026
ఆస్టియోపోరోసిస్ ముప్పు వారికే ఎక్కువ

మెనోపాజ్దశలో ఆడవాళ్లలో ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సంతాన సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ రిస్క్ మరింత ఎక్కువని ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ జర్నల్లోని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గతంలో సంతాన లేమి, గర్భస్రావం, మృత శిశువు జన్మించటం వంటివి జరిగిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్ ముప్పు 16శాతం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీరు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


