News April 6, 2024
IPL మొత్తానికి హసరంగ దూరం!

SRH స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఎడమ మడమ నొప్పి కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు ESPNcricinfo తెలిపింది. కాగా మినీ వేలంలో హసరంగను రూ.1.5 కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రిస్క్ తీసుకోకూడదని శ్రీలంక అతడికి పూర్తి విరామం ఇచ్చింది. ప్రస్తుతం హసరంగ శ్రీలంకలోనే రెస్ట్ తీసుకుంటున్నారు.
Similar News
News November 10, 2025
ఆర్థిక మోసానికి గురయ్యారా? ఇలా ఫిర్యాదు చేయండి

ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు Sachet పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలు/వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి దీనిని రూపొందించారు. మీరు మోసపోయినట్లయితే <
News November 10, 2025
మెడికల్ విద్య కోసం ఇప్పుడు జార్జియా వైపు!

భారత్ నుంచి అనేకమంది వైద్యవిద్య కోసం గతంలో ఉక్రెయిన్‌కు వెళ్లేవారు. రష్యాతో యుద్ధంతో ఇప్పుడు జార్జియా వైపు మళ్లుతున్నారు. RBI ప్రకారం అక్కడ ఈ చదువు కోసం 2018-19లో $10.33M వెచ్చించగా 2024-25లో అది $50.25Mలకు పెరిగింది. కాగా వారు ఇండియా వచ్చాక NExT/FMGE పాస్ కావాలి. జార్జియా నుంచి వచ్చే వారిలో 35% మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. అక్కడి వర్సిటీల గురించి ముందే తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 10, 2025
PM కిసాన్ లిస్టులో మీ పేరు లేదా? కారణమిదే!

PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి లక్షలాది మంది లబ్ధిదారులను తొలగించారన్న ప్రచారంపై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘గైడ్‌లైన్స్ ప్రకారం 2019 FEB 1 తర్వాత భూమి కొన్న వారికి ఈ స్కీమ్ వర్తించదు. ఒకే ఫ్యామిలీ నుంచి భర్త, భార్య, పిల్లలు వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాం. అలాంటి వారికి తాత్కాలికంగా నిలిపివేశాం. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అర్హులని తేలితే మళ్లీ జాబితాలో చేర్చుతాం’ అని పేర్కొంది.


