News October 2, 2025

ప్రకాశం: టిప్పర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జరుగుమల్లి శివారులో ఉన్న పాలకేంద్రం సమీపంలో రోడ్డు మార్జిన్‌లో టిప్పర్ నిలిపి ఉంది. కామేపల్లి నుంచి టంగుటూరు వైపు బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు నిలిపి ఉన్న టిప్పర్‌ను గమనించక వెనక వేగంగా గుద్దారు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా వీరిద్దరు జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

Similar News

News October 2, 2025

గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు: SP

image

గాంధీ ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించిన ఎస్పీ, కార్యాలయంలోని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీజీ దేశానికి చేసిన సేవలపై ఎస్పీ ప్రసంగించారు.

News October 2, 2025

ప్రకాశంతో.. గాంధీజీకి ఉన్న అనుబంధం ఇదే!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు మహాత్మాగాంధీజీకి గొప్ప అనుబంధం ఉంది. వేటపాలెంలోని సారస్వత నికేతనం గ్రంథాలయానికి పునాది వేసింది స్వయానా గాంధీజీనే. 1929లో వేటపాలెంకు వచ్చిన గాంధీజీకి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఆ సమయంలో గాంధీజీ చేతికర్ర స్వల్పంగా విరిగింది. దీంతో తన జ్ఞాపకార్థం ఆ కర్రను గ్రంథాలయంలోనే గాంధీజీ వదిలివెళ్లారు. నేటికీ గ్రంథాలయానికి వెళితే, గాంధీ చేతి క ్ర్ర‌ను దర్శించవచ్చు.

News October 2, 2025

ఒంగోలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

ఒంగోలులోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ బయట, ప్రహరీ గోడ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవని, అయితే స్థానికంగా యాచకుడు అన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.