News October 3, 2025
ADB: గాంధీ పార్కులో ‘వేస్ట్ టు వండర్’ ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో గురువారం నాడు ‘వేస్ట్ టు వండర్’ పార్కును జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ట్రైనీ కలెక్టర్ సలోని, మున్సిపల్ కమిషనర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినియోగంలో లేని వస్తువులతో ఆకర్షణీయమైన ఉపకరణాలు తయారు చేయడం అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పార్క్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 2, 2025
ఆయుధపూజలో ఆదిలాబాద్ SP

విజయదశమి వేడుకలను జిల్లావ్యాప్తంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని ఆయుధ భాండాగార మందిరంలో ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. వేద పండితుల శాస్త్రోక్తాల మధ్య దుర్గామాత సన్నిధిలో సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
News October 2, 2025
ADB: బార్డర్లపై ఫోకస్ పెడితే బెటర్ బాస్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులంతా మహారాష్ట్ర బార్డర్లపై దృష్టిసారించాల్సిన అవసరముంది. ఎందుకంటే అక్కడి నుంచే అక్రమ మద్యం ADBలోకి తీసుకొచ్చే ఆస్కారముంది. అక్కడ అక్కడ తక్కువ ధరకు దొరికే దేశీదారును అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంచే అవకాశముంది. తలమడుగు, తాంసి, బేల, భీంపూర్, భైంసా, కుబీర్, జైనథ్, చింతలమానేపల్లి ఇలా సరిహద్దుల్లోని మండలాల్లో చెక్‌పోస్టు తనిఖీలు పెంచాలి.
News October 2, 2025
ప్రింటింగ్ ప్రెస్, ఫ్లెక్సీ యజమానులతో కలెక్టర్ సమావేశం

జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలకు సంబంధించిన రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఈ క్రమంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్‌తో కలిసి కలెక్టర్, ప్రింటింగ్ ప్రెస్, ఫ్లెక్సీ యజమానులతో మాట్లాడారు. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి సహకారం అందించాలని కోరారు.