News October 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News October 3, 2025
ముగిసిన దసరా సెలవులు

AP: రాష్ట్రంలో స్కూళ్లకు దసరా సెలవులు నిన్నటితో ముగిశాయి. ఇవాళ్టి నుంచి క్లాసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి వరుసగా 11 రోజుల పాటు హాలిడేస్ ఆస్వాదించిన విద్యార్థులు, టీచర్లు ఇక బడి బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. పండుగ కోసం ఊర్లకు వెళ్లినవారు ప్రభుత్వం సెలవులను ఒక్కరోజైనా పొడిగిస్తుందని ఆశగా ఎదురుచూశారు. నిన్న రాత్రి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశచెందారు.
News October 3, 2025
ఏడు కొండలు ఏడు శక్తి కేంద్రాలు- గరుడాద్రి

తిరుమలలోని ఏడు కొండలు ఏడు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. మూడవ కొండను గరుడాద్రిగా పిలుస్తారు. ఇక్కడ ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి మణిపుర చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికి సాధకుడికి సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది. జ్ఞాన శక్తి, గ్రహణశక్తి పెరుగుతుంది. ‘గ’కార శబ్దం జ్ఞానానికి ప్రతీక. అందుకే కొండకి గరుడాద్రి అని పేరు. ఇది సాధకుని జ్ఞానార్హతను సూచిస్తుంది.
<<-se>>#VINAROBHAGYAMU<<>>
News October 3, 2025
ఓపెన్ పోర్స్ తగ్గడానికి ముల్తానీ మట్టితో ప్యాక్

మొటిమలు, పొల్యూషన్ కారణంగా చాలా మందిలో ముఖంలో ఓపెన్ పోర్స్ వస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి, పసుపు, రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని రాసుకొని 15ని. తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేసుకుంటే ఫలితం ఉంటుంది. శనగపిండి ప్యాక్ కూడా బాగా ఉపయోగపడుతుంది.
<<-se>>#SkinCare<<>>