News October 3, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి

AP: ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన నేపథ్యంలో ప్రభుత్వం అలర్టయింది. హోంమంత్రి అనిత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ ఈదురుగాలులకు ఆస్కారం ఉంది. రాత్రంతా అధికారులందరూ అందుబాటులో ఉండాలి. ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. రోడ్డు మీద పడే చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలి. వంశధార, నాగావళి వరదకు ఛాన్స్ ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి’ అని ఆదేశించారు.
Similar News
News October 3, 2025
గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 57 మంది మృతి

ట్రంప్ ప్రతిపాదించిన పీస్ డీల్‌కు హమాస్ ఇంకా అంగీకరించకపోవడంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. నిన్నటి నుంచి పలుచోట్ల చేపట్టిన దాడుల్లో 57 మంది పాలస్తీనియన్లు మరణించారు. సౌత్ గాజాలో 27 మంది, ఆహార పంపిణీ కేంద్రాల వద్ద 30 మంది చనిపోయినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. అటు గాజాకు మానవతాసాయాన్ని అందించేందుకు వచ్చిన 40కి పైగా షిప్పులను ఇజ్రాయెల్ బలగాలు అడ్డుకున్నాయి.
News October 3, 2025
ముగిసిన దసరా సెలవులు

AP: రాష్ట్రంలో స్కూళ్లకు దసరా సెలవులు నిన్నటితో ముగిశాయి. ఇవాళ్టి నుంచి క్లాసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి వరుసగా 11 రోజుల పాటు హాలిడేస్ ఆస్వాదించిన విద్యార్థులు, టీచర్లు ఇక బడి బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. పండుగ కోసం ఊర్లకు వెళ్లినవారు ప్రభుత్వం సెలవులను ఒక్కరోజైనా పొడిగిస్తుందని ఆశగా ఎదురుచూశారు. నిన్న రాత్రి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశచెందారు.
News October 3, 2025
ఏడు కొండలు ఏడు శక్తి కేంద్రాలు- గరుడాద్రి

తిరుమలలోని ఏడు కొండలు ఏడు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. మూడవ కొండను గరుడాద్రిగా పిలుస్తారు. ఇక్కడ ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి మణిపుర చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికి సాధకుడికి సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది. జ్ఞాన శక్తి, గ్రహణశక్తి పెరుగుతుంది. ‘గ’కార శబ్దం జ్ఞానానికి ప్రతీక. అందుకే కొండకి గరుడాద్రి అని పేరు. ఇది సాధకుని జ్ఞానార్హతను సూచిస్తుంది.
<<-se>>#VINAROBHAGYAMU<<>>