News October 3, 2025
అరుదైన రికార్డు.. వరల్డ్ క్రికెట్లో ఒకే ఒక్కడు

భారత స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పారు. విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి భారత్‌లో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్(51), ఆస్ట్రేలియా(64), భారత్.. మూడు దేశాల్లో 50 వికెట్లు తీసిన ప్లేయర్‌గా బుమ్రా నిలిచారు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లోని యాక్టివ్ ప్లేయర్లలో ఈ ఘనత సాధించింది అతనొక్కడే కావడం విశేషం.
Similar News
News October 3, 2025
దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ eసిమ్ సేవలు

బీఎస్ఎన్‌ఎల్ ఇకపై యూజర్లకు eసిమ్ కార్డులు జారీ చేయనుంది. టాటా కమ్యూనికేషన్స్‌తో కలిసి ఈ సేవలను అందించనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఫిజికల్ సిమ్ కార్డు లేకపోయినా BSNL నెట్‌వర్క్‌ను ఉపయోగించవచ్చు. కేవలం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చని టాటా కమ్యూనికేషన్స్ తెలిపింది. 2G, 3G, 4G నెట్‌వర్క్ యూజర్లకు ఇ-సిమ్ పనిచేస్తుందని పేర్కొంది. ఇప్పటికే తమిళనాడులో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.
News October 3, 2025
లక్ష్మీదేవికి తామరపువ్వుతో పూజ చేస్తే..

లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుతో ఆమెను శుక్రవారాల్లో పూజించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. అలాగే ఎర్రగులాబీ, మందారం పూలతోనూ పూజ చేయొచ్చంటున్నారు. బియ్యం, బెల్లంతో పాయసం చేసి సమర్పించడం వల్ల దేవి సంతృప్తి చెంది ఆశీర్వదిస్తారని పేర్కొంటున్నారు. ఇంట్లో శ్రేయస్సు, మనశ్శాంతి లభిస్తుందని, డబ్బు సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని తెలుపుతున్నారు.
News October 3, 2025
నిన్న నాన్‌వెజ్ ఎక్కువైందా? ఇలా చేయండి

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం ఆయుధ, శమీ పూజలతో మొదలెట్టి రాత్రి రావణ దహనంతో వేడుకలను ముగించారు. గాంధీ జయంతి అయినప్పటికీ మాంసం, మద్యం విషయంలో చాలామంది కాంప్రమైజ్ కాలేదు. నిన్న నాన్‌వెజ్ ఎక్కువగా తిన్నవారు ఇవాళ లైట్, ఫైబర్ రిచ్, లోఫ్యాట్ డైట్ పాటిస్తూ ప్రోబయాటిక్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హైడ్రేషన్ కోసం నీరెక్కువగా తాగాలంటున్నారు. SHARE IT