News October 3, 2025

దేవరగట్టులో బన్ని జైత్రయాత్ర ప్రారంభం

image

కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో బన్ని జైత్రయాత్ర వైభవంగా ప్రారంభమైంది. దేవతామూర్తులు మాళమ్మ, మల్లేశ్వరస్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు మూడు గ్రామాల భక్తులు ఒకవైపు, ఏడు గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడుతున్నారు. ఈ సమరాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. యాత్రను ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News October 3, 2025

విజయనగరం జిల్లాలో వర్షపాతం వివరాలు..

image

వాయుగుండం కారణంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. జిల్లా మొత్తం సరాసరి 28.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గరివిడిలో 88.6 మి.మీ., మెంటాడలో 34.6, గుర్లలో 80.0, చీపురుపల్లిలో 68, నెల్లిమర్లలో 66.8, వంగరలో 56.6, తెర్లాంలో 54.4, మెరకముడిదాంలో 51.2, దత్తిరాజేరులో 47.6 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. దీంతో అనేక ప్రాంతాల్లో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

News October 3, 2025

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ eసిమ్ సేవలు

image

బీఎస్ఎన్‌ఎల్ ఇకపై యూజర్లకు eసిమ్ కార్డులు జారీ చేయనుంది. టాటా కమ్యూనికేషన్స్‌తో కలిసి ఈ సేవలను అందించనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఫిజికల్ సిమ్ కార్డు లేకపోయినా BSNL నెట్‌వర్క్‌ను ఉపయోగించవచ్చు. కేవలం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చని టాటా కమ్యూనికేషన్స్ తెలిపింది. 2G, 3G, 4G నెట్‌వర్క్ యూజర్లకు ఇ-సిమ్ పనిచేస్తుందని పేర్కొంది. ఇప్పటికే తమిళనాడులో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.

News October 3, 2025

శ్రీకాకుళం: నేటి నుంచి టీచర్లకు శిక్షణ

image

శ్రీకాకుళం డీఎస్సీ-2025 ద్వారా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుక్రవారం నుంచి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జిల్లాలో కొత్తగా ఎంపికైన 534 మంది టీచర్లకు గ్లోబల్ పబ్లిక్ స్కూల్, జే వై హాస్టల్, శ్రీవిశ్వ విజేత జూనియర్ కాలేజ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఎవరికి ఎక్కడ ట్రైనింగ్ సెంటర్ అనేది ముందుగానే సమాచారం ఇచ్చారు.