News October 3, 2025
రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

AP: రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే నికర జీఎస్టీ వసూళ్లలో 7.45% , స్థూల జీఎస్టీ వసూళ్లలో 4.19% వృద్ధి నమోదైంది. నికర GST కలెక్షన్స్ రూ.2,789 కోట్లకు చేరగా, స్థూల జీఎస్టీ కలెక్షన్స్ రూ.3,653 కోట్లు వచ్చాయి. రాష్ట్ర GST రాబడి 8.28% పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తులపై 3.10% వృద్ధితో రూ.1,380 కోట్ల రాబడి వచ్చింది.
Similar News
News October 3, 2025
ఇండియన్ ఆర్మీలో 194 పోస్టులు

ఇండియన్ ఆర్మీ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & మెకానికల్ ఇంజినీర్స్ 194 గ్రూప్ సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 4 నుంచి 24వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, PET, PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianarmy.nic.in/
News October 3, 2025
తిరుమల: శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సర్వ దర్శనానికి 20గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరుడి దర్శనం కోసం బాట గంగమ్మ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 75,188 మంది దర్శించుకోగా.. 31,640 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.66కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిన్న ధ్వజావరోహణంతో ముగిసిన విషయం తెలిసిందే.
News October 3, 2025
దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ eసిమ్ సేవలు

బీఎస్ఎన్‌ఎల్ ఇకపై యూజర్లకు eసిమ్ కార్డులు జారీ చేయనుంది. టాటా కమ్యూనికేషన్స్‌తో కలిసి ఈ సేవలను అందించనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఫిజికల్ సిమ్ కార్డు లేకపోయినా BSNL నెట్‌వర్క్‌ను ఉపయోగించవచ్చు. కేవలం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చని టాటా కమ్యూనికేషన్స్ తెలిపింది. 2G, 3G, 4G నెట్‌వర్క్ యూజర్లకు ఇ-సిమ్ పనిచేస్తుందని పేర్కొంది. ఇప్పటికే తమిళనాడులో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.