News October 3, 2025
అంబానీ ఆస్తి.. 24 రాష్ట్రాల జీడీపీ కంటే అధికం

హురూన్ రిచ్ లిస్ట్-2025లో ముకేశ్ అంబానీ రూ.9.55 లక్షల కోట్లతో తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ నెట్‌వర్త్ దేశంలోని 24 రాష్ట్రాల జీడీపీ కంటే అధికం. ఇండియా ఇన్ పిక్సెల్ డాటా ప్రకారం.. నాలుగు రాష్ట్రాలు మాత్రమే అంతకంటే ఎక్కువ జీడీపీ కలిగి ఉన్నాయి. మహారాష్ట్ర రూ.24.11 లక్షల కోట్లు, తమిళనాడు రూ.15.71 లక్షల కోట్లు, UP, కర్ణాటక రూ.14.23 లక్షల కోట్ల జీడీపీతో ముందున్నాయి.
Similar News
News October 3, 2025
యంత్ర ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

యంత్ర ఇండియా లిమిటెడ్( మహారాష్ట్ర) 2 సీనియర్, 3 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. ICAI, ICMAI, HSSC, CA, CMA విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గరిష్ఠ వయసు 40ఏళ్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గరిష్ఠ వయసు 50ఏళ్లు.
News October 3, 2025
అమానుషం.. ప్రాణం పోతున్నా చేతులకు బేడీలు

బంగ్లాదేశ్ మాజీ మంత్రి నూరుల్ మాజిద్ మరణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓ కేసులో అరెస్టైన ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించగా అదే సమయంలో చేతికి బేడీలు ఉన్న ఫొటో SMలో వైరలవుతోంది. యూనస్ ప్రభుత్వం తీరు అమానుషమని అవామీ లీగ్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే పారిపోకుండా ఉండేందుకు బేడీలు వేశామని పోలీసులు చెప్పడం గమనార్హం. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు నూరుల్ సన్నిహితుడు.
News October 3, 2025
NITఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్(NIT) 2 టెక్నికల్ అసోసియేట్ పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. పోస్టును బట్టి బీటెక్/బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీలో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వీటిని ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఈనెల 8న ఉదయం 9.30 గంటలకు ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: https://nitandhra.ac.in/