News October 3, 2025

‘డియర్ రావణ్’.. నటి ట్వీట్‌పై వివాదం

image

దసరా వేళ బాలీవుడ్ నటి సిమీ గరేవాల్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘డియర్ రావణ్. టెక్నికల్‌గా మీరు చెడ్డవారు కాదు. చిలిపివారు. సీతకు మంచి ఆహారం, ఆశ్రయం ఇచ్చారు. మహిళా సెక్యూరిటీ గార్డ్స్‌ను పెట్టారు. మ్యారేజ్ రిక్వెస్ట్‌ వినయంగా చేశారు. రాముడు చంపుతున్నప్పుడూ క్షమాపణలు చెప్పారు. మా పార్లమెంట్‌లోని సగం మంది కంటే మీరు చాలా ఎడ్యుకేటెడ్’ అని పేర్కొన్నారు. దీనిపై విమర్శలు రావడంతో పోస్టును డిలీట్ చేశారు.

Similar News

News October 3, 2025

మళ్లీ పెరగనున్న మొబైల్ టారిఫ్‌లు?

image

భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్‌లను 10-12 శాతం వరకు పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈక్రమంలో నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇప్పటికే 1GB ప్లాన్లను తొలగించారు. సరసమైన ప్లాన్లు కనిపించట్లేదు. డేటా ప్లాన్‌లను బలవంతంగా రుద్దుతున్నారు. ధరలు భారీగా పెరిగాయి. అయినా TRAI స్పందించట్లేదు’ అని నెటిజన్లు ఫైరవుతున్నారు. మీ కామెంట్?

News October 3, 2025

శక్తిమంతమైన కంటెంట్ పోస్ట్ చేయండి: సజ్జనార్

image

సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. కంటెంట్ హాస్యం కోసం కాకుండా శక్తిమంతంగా ఉండాలని Xలో పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను మహిళా రక్షణ, డ్రగ్స్ వ్యతిరేక, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించే రీల్స్, పోస్టులకు వేదికగా మార్చాలని పేర్కొన్నారు. లైక్స్ కాదు, జీవితాలను(లైవ్స్) కాపాడటమే ముఖ్యమన్నారు. మీరు ఇవాళ చేసే వీడియో రేపు ఒక జీవితాన్ని నిలబెడుతుందని సూచించారు.

News October 3, 2025

అజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. స్పందించిన సనా మిర్

image

WWCలో భాగంగా PAK, BAN మ్యాచ్ సందర్భంగా పాక్ కామెంటేటర్ సనా మిర్ చేసిన <<17897473>>అజాద్ కశ్మీర్<<>> వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించారు. రాజకీయ కోణంలో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్లేయర్ నటాలియా పడిన కష్టాలను చెప్పే క్రమంలో ఆ పదాన్ని వాడినట్లు వివరించారు. అనుకోకుండా వాడిన పదానికి వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని తెలిపారు.