News October 3, 2025

గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 57 మంది మృతి

image

ట్రంప్ ప్రతిపాదించిన పీస్‌ డీల్‌కు హమాస్ ఇంకా అంగీకరించకపోవడంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. నిన్నటి నుంచి పలుచోట్ల చేపట్టిన దాడుల్లో 57 మంది పాలస్తీనియన్లు మరణించారు. సౌత్ గాజాలో 27 మంది, ఆహార పంపిణీ కేంద్రాల వద్ద 30 మంది చనిపోయినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. అటు గాజాకు మానవతాసాయాన్ని అందించేందుకు వచ్చిన 40కి పైగా షిప్పులను ఇజ్రాయెల్ బలగాలు అడ్డుకున్నాయి.

Similar News

News October 3, 2025

ఇందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

image

ప్రపంచవ్యాప్తంగా డాలర్‌ వాడకం తగ్గడం, BRICS దేశాలు భారీగా బంగారాన్ని కొనడంతోనే గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ వంటి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు & స్టాక్స్/క్రిప్టో మార్కెట్ల అనిశ్చితి మధ్య పెట్టుబడిదారులు పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అంతేకాక, బంగారం ఉత్పత్తి తగ్గడం.. డాలర్ బలహీనపడటం కూడా దీని విలువను పెంచుతున్నాయి.

News October 3, 2025

తాజా న్యూస్

image

* TG: సికింద్రాబాద్-ఫలక్‌నుమా రైల్వే లైన్‌పై ROBని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రూ.52.03 కోట్ల వ్యయంతో 360 మీటర్ల పొడవైన నాలుగు లైన్ల బ్రిడ్జి నిర్మాణం.
* AP: పల్నాడులోని సత్తెనపల్లిలో హోటల్ సిబ్బందితో ఘర్షణ.. YCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు
* వాయుగుండం బీభత్సం.. విశాఖలో 80 ప్రాంతాల్లో కూలిన చెట్లు
* వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 218/3

News October 3, 2025

రోజూ 30ని.లు నడిస్తే!

image

నడక మన ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నా చాలా మంది అడుగేయకుండా ఉన్నచోటే కూర్చుండిపోతున్నారు. కానీ రోజుకు 30 ని.లు నడిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని 35% తగ్గిస్తుంది. సెరోటోనిన్ & డోపమైన్ స్థాయులను పెంచి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యాన్ని పెంచి, జ్ఞాపకశక్తి క్షీణతను తగ్గిస్తుంది. SHARE IT