News October 3, 2025
దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ eసిమ్ సేవలు

బీఎస్ఎన్‌ఎల్ ఇకపై యూజర్లకు eసిమ్ కార్డులు జారీ చేయనుంది. టాటా కమ్యూనికేషన్స్‌తో కలిసి ఈ సేవలను అందించనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఫిజికల్ సిమ్ కార్డు లేకపోయినా BSNL నెట్‌వర్క్‌ను ఉపయోగించవచ్చు. కేవలం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చని టాటా కమ్యూనికేషన్స్ తెలిపింది. 2G, 3G, 4G నెట్‌వర్క్ యూజర్లకు ఇ-సిమ్ పనిచేస్తుందని పేర్కొంది. ఇప్పటికే తమిళనాడులో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.
Similar News
News October 3, 2025
‘స్త్రీనిధి’ చెల్లింపులకు యాప్.. ఎలా వాడాలంటే?

AP: బ్యాంకుకు వెళ్లకుండా నేరుగా స్త్రీనిధి వాయిదా చెల్లింపుల కోసం ప్రభుత్వం ‘కాప్స్ రికవరీ’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. అందులో సభ్యురాలి ఫోన్ నంబరు/పిన్‌తో లాగిన్ అవ్వాలి. గ్రూప్ పేరు సెలెక్ట్ చేస్తే లోన్ తీసుకున్నవారి లిస్ట్ కనిపిస్తుంది. పేరు క్లిక్ చేయగానే ఆమె చెల్లించాల్సిన మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తుంది. డబ్బు చెల్లించాక రసీదు జనరేట్ అవుతుంది.
News October 3, 2025
స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం: ఎస్ఈసీ

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమైంది. ఎంపీటీసీ, ZPTC ఎలక్షన్స్‌కు 37,652, పంచాయతీ ఎన్నికలకు 1,35,264 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం కాగా 1,18,547 ఉన్నాయని తెలిపింది. జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు దశల వారీగా 651 మంది, ఎంపీటీసీ ఎన్నికలకు 2,337 మంది ఆర్వోలు, 2,340 మంది ఏఆర్‌వోలు, 39,533 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,58,725 మంది ఇతర సిబ్బంది రెడీగా ఉన్నారని వివరించింది.
News October 3, 2025
ఆన్‌లైన్ మనీగేమ్‌లపై ప్రచారం చేస్తే 2 ఏళ్ల జైలు

ఆన్‌లైన్ మనీగేమ్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. PROG Act ప్రకారం కేంద్రం draft రూల్స్‌ను ప్రకటించింది. OGAIకి సివిల్ కోర్టు అధికారాలు కల్పించింది. ఇకపై ఈ గేమ్‌లను ఆఫర్ చేస్తే 3ఏళ్ల జైలు, ₹1 కోటి జరిమానా విధిస్తారు. వీటిపై ప్రచారాలు చేసే వారికి 2ఏళ్ల ఖైదు, ₹50 లక్షల ఫైన్ తప్పదు. వారెంటు లేకుండా సోదాలు, అరెస్టులూ చేయొచ్చు. పందేలు, పాయింట్లను మనీగా మార్చుకొనేలా ఉంటే మనీ గేమ్‌లుగా పరిగణిస్తారు.