News October 3, 2025
‘కాంతార ఛాప్టర్-1’కు తొలి రోజు భారీ కలెక్షన్స్!

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కాంతార ఛాప్టర్-1’కు తొలి రోజు భారీ కలెక్షన్స్ వచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ప్రీమియర్స్‌తో కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ.65 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. కూలీ(రూ.65 కోట్లు), ఛావా(రూ.31 కోట్లు), సికందర్(రూ.26 కోట్లు), సైయారా(రూ.22 కోట్లు) చిత్రాల తొలిరోజు కలెక్షన్లను అధిగమించిందని వెల్లడించాయి.
Similar News
News October 3, 2025
తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్!

AP: తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపాయి. పలుచోట్ల RDX బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ పంపారు. “హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్” పేరిట వచ్చిన వీటిపై అధికారులు అలర్టయ్యారు. తిరుపతి, శ్రీకాళహస్తి, అలిపిరి, తిరుచానూరులో భద్రతా విభాగాలు సోదాలు చేపట్టాయి. 2024 అక్టోబర్లో కూడా ఇవే రకమైన మెయిల్స్ రాగా అధికారుల తనిఖీల్లో బూటకపు బెదిరింపుగా తేలింది.
News October 3, 2025
బియ్యం పురుగుపట్టకుండా ఉండాలంటే?

* ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు అందులో కొంచెం పాలు కలిపితే ముక్కలు నల్లబడవు.
* ఇడ్లీ, దోశల పిండిలో రెండు తమలపాకులు వేసి ఉంచితే తాజాగా ఉంటుంది.
* బియ్యం పోసుకునే బాక్సులో నాలుగు ఎండు మిరపకాయలను ఉంచితే పురుగు పట్టదు.
* కోడిగుడ్లను ఉడకబెట్టే నీటిలో ఒక స్పూన్ వెనిగర్ కలిపితే గుడ్డు పగిలినా అందులోని పదార్థం బయటకు రాదు.
<<-se>>#VantintiChitkalu<<>>
News October 3, 2025
GST 2.0 అమలు చేయని వారిపై కేసులు

TAXల భారం తగ్గిస్తూ కేంద్రం GST 2.0ని తెచ్చింది. 4 శ్లాబులను 2కి కుదించి SEP22 నుంచి అమలు చేస్తోంది. పాత సరకుల్ని సైతం తగ్గిన ధరలతో అమ్మాలని ఆదేశించింది. కానీ చాలా చోట్ల వ్యాపారులు పాత SLABలతో విక్రయిస్తున్నారు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టి ఒక్క HYDలోనే ఎలక్ట్రానిక్, వాహన షోరూములపై 30 కేసులు నమోదుచేశారు. అక్రమాలపై ₹10వేలకు పైగా జరిమానా, సివియర్ కేసైతే ఫైన్‌తో పాటు 5 ఏళ్ల వరకు ఖైదు విధిస్తారు.