News October 3, 2025

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

TG: రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ నెల 5న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డిలో అక్కడక్కడ వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు మంగళవారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Similar News

News October 3, 2025

తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్!

image

AP: తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపాయి. పలుచోట్ల RDX బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ పంపారు. “హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్” పేరిట వచ్చిన వీటిపై అధికారులు అలర్టయ్యారు. తిరుపతి, శ్రీకాళహస్తి, అలిపిరి, తిరుచానూరులో భద్రతా విభాగాలు సోదాలు చేపట్టాయి. 2024 అక్టోబర్లో కూడా ఇవే రకమైన మెయిల్స్ రాగా అధికారుల తనిఖీల్లో బూటకపు బెదిరింపుగా తేలింది.

News October 3, 2025

బియ్యం పురుగుపట్టకుండా ఉండాలంటే?

image

* ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు అందులో కొంచెం పాలు కలిపితే ముక్కలు నల్లబడవు.
* ఇడ్లీ, దోశల పిండిలో రెండు తమలపాకులు వేసి ఉంచితే తాజాగా ఉంటుంది.
* బియ్యం పోసుకునే బాక్సులో నాలుగు ఎండు మిరపకాయలను ఉంచితే పురుగు పట్టదు.
* కోడిగుడ్లను ఉడకబెట్టే నీటిలో ఒక స్పూన్ వెనిగర్ కలిపితే గుడ్డు పగిలినా అందులోని పదార్థం బయటకు రాదు.
<<-se>>#VantintiChitkalu<<>>

News October 3, 2025

GST 2.0 అమలు చేయని వారిపై కేసులు

image

TAXల భారం తగ్గిస్తూ కేంద్రం GST 2.0ని తెచ్చింది. 4 శ్లాబులను 2కి కుదించి SEP22 నుంచి అమలు చేస్తోంది. పాత సరకుల్ని సైతం తగ్గిన ధరలతో అమ్మాలని ఆదేశించింది. కానీ చాలా చోట్ల వ్యాపారులు పాత SLABలతో విక్రయిస్తున్నారు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టి ఒక్క HYDలోనే ఎలక్ట్రానిక్, వాహన షోరూములపై 30 కేసులు నమోదుచేశారు. అక్రమాలపై ₹10వేలకు పైగా జరిమానా, సివియర్ కేసైతే ఫైన్‌తో పాటు 5 ఏళ్ల వరకు ఖైదు విధిస్తారు.