News October 3, 2025
అమానుషం.. ప్రాణం పోతున్నా చేతులకు బేడీలు

బంగ్లాదేశ్ మాజీ మంత్రి నూరుల్ మాజిద్ మరణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓ కేసులో అరెస్టైన ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించగా అదే సమయంలో చేతికి బేడీలు ఉన్న ఫొటో SMలో వైరలవుతోంది. యూనస్ ప్రభుత్వం తీరు అమానుషమని అవామీ లీగ్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే పారిపోకుండా ఉండేందుకు బేడీలు వేశామని పోలీసులు చెప్పడం గమనార్హం. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు నూరుల్ సన్నిహితుడు.
Similar News
News October 3, 2025
అర్ధసెంచరీలు చేసిన జురెల్, జడేజా

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమ్ ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 218 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోగా జురెల్(68*), జడేజా(50*) అర్ధసెంచరీలతో ఇన్నింగ్సును చక్కదిద్దారు. ఐదో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 326/4 కాగా 164 రన్స్ ఆధిక్యంలో ఉంది.
News October 3, 2025
‘ఐ లవ్ మోదీ’ అనొచ్చు.. ‘ఐ లవ్ మహమ్మద్’ అనకూడదా: ఒవైసీ

యూపీలోని బరేలీలో ‘<<17838405>>ఐ లవ్ మహమ్మద్<<>>’ అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ధ్వజమెత్తారు. దేశంలో ‘ఐ లవ్ మోదీ’ అంటే ఎలాంటి సమస్య ఉండదని, ‘ఐ లవ్ మహమ్మద్’ అంటే అభ్యంతరమా? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలతో దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారని నిలదీశారు. తాను మహమ్మద్ వల్లే ముస్లింగా ఉన్నానని పేర్కొన్నారు. దేశంలో 17 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారని తెలిపారు.
News October 3, 2025
తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్!

AP: తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపాయి. పలుచోట్ల RDX బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ పంపారు. “హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్” పేరిట వచ్చిన వీటిపై అధికారులు అలర్టయ్యారు. తిరుపతి, శ్రీకాళహస్తి, అలిపిరి, తిరుచానూరులో భద్రతా విభాగాలు సోదాలు చేపట్టాయి. 2024 అక్టోబర్లో కూడా ఇవే రకమైన మెయిల్స్ రాగా అధికారుల తనిఖీల్లో బూటకపు బెదిరింపుగా తేలింది.