News October 3, 2025

MBNR: దసరా EFFECT.. మాంసం దుకాణాలు కిటకిట

image

దసరా పండుగ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మాంసం దుకాణాలు జనాలతో కిటకిటలాడాయి. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల్, వనపర్తి సహా పలు ప్రాంతాలలో శుక్రవారం ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. నిన్న గాంధీ జయంతి సందర్భంగా దుకాణాలు బంద్ కావడంతో, ఇవాళ మాంసం కొనుగోలు కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.

Similar News

News October 3, 2025

సీఎం చేతుల మీదుగా ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభం

image

సీఎం చంద్రబాబు శనివారం ‘ఆటో డ్రైవర్ సేవలో’ అనే నూతన పథకాన్ని ప్రారంభించనున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉదయం 9:30 గంటలకు ఆయన స్వయంగా ఆటో ఎక్కి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సహా పలువురు మంత్రులు హాజరవుతారని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 3, 2025

వరంగల్: ఆ సీఐ ముందు నుంచి వివాదాస్పదుడే..!

image

నర్సంపేట సీఐ రఘుపతి రెడ్డి ముందు నుంచి వివాదాస్పదుడిగా తెలుస్తోంది. గతంలో జనగామ సీఐగా పనిచేసిన సమయంలో అడ్వకేట్ అమ్భతరావు, అతడి భార్యను అదుపులోకి తీసుకున్న ఘటనలో భార్య ఎదుటే అడ్వకేట్‌‌ను అవమానపరిచాడనే ఆరోపణలతో సీపీ విచారణ జరిపారు. తాజాగా గాంధీ జయంతి రోజు నర్సంపేటలో జంతువధను చేస్తున్న సమయంలో కత్తితో త్వరగా కొట్టు అంటూ అనడంపై వివాదాస్పదమైంది. ఈ ఘటనపై DCP ఈస్ట్ జోన్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.

News October 3, 2025

సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై హెల్ప్ డెస్క్ ఏర్పాటు

image

సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, జీఎస్టీకి సంబంధించిన వివరాలను తెలిపేందుకు సీటీవో ఏలూరు సర్కిల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని సిటీవో చిట్టిబాబు తెలిపారు. జీఎస్టీ వివరాలను తెలుసుకునేందుకు జిల్లా ప్రజలు సీటీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ 8096082086‌కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చునని తెలిపారు. నేరుగా కార్యాలయాన్ని కూడా సంప్రదించి వివరాలు పొందవచ్చన్నారు.