News October 3, 2025
శక్తిమంతమైన కంటెంట్ పోస్ట్ చేయండి: సజ్జనార్

సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. కంటెంట్ హాస్యం కోసం కాకుండా శక్తిమంతంగా ఉండాలని Xలో పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను మహిళా రక్షణ, డ్రగ్స్ వ్యతిరేక, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించే రీల్స్, పోస్టులకు వేదికగా మార్చాలని పేర్కొన్నారు. లైక్స్ కాదు, జీవితాలను(లైవ్స్) కాపాడటమే ముఖ్యమన్నారు. మీరు ఇవాళ చేసే వీడియో రేపు ఒక జీవితాన్ని నిలబెడుతుందని సూచించారు.
Similar News
News October 3, 2025
‘ఓం నమ: శివాయ’ అంటే?

ఇది మహాశివుడి మహోన్నత నామం. ఇదే పంచాక్షరీ మంత్రం కూడా. ఇందులోని ‘ఓం’ అనేది బీజాక్షరం. శేష అక్షరాల్లో ప్రతి దానికీ ఓ దివ్యార్థం ఉంది. ఆ అక్షరాలు పంచ భూతాలకు, పరమ పవిత్రతకు ప్రతీకలు.
న – భూమి
మ – నీరు
శి – అగ్ని
వ – గాలి
య – ఆకాశం
<<-se>>#ShivaNaamaalu<<>>
News October 3, 2025
మహిళల ఆరోగ్యానికి ‘ప్రోబయాటిక్స్’ బెస్ట్

శరీరానికి మేలు చేసే సజీవ సూక్ష్మజీవులనే ప్రోబయాటిక్స్ అంటారు. పులియబెట్టిన ఆహార పదార్థాల(పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోసె, కెఫీర్)లో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటాయి. అరటి, యాపిల్, ఉల్లి, వెల్లుల్లిలోనూ లభిస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే మహిళల్లో యూరినల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ వెజైనోసిస్, గర్భధారణ, నెలసరి, మెనోపాజ్ దశల్లో వచ్చే మూడ్ స్వింగ్స్‌ను అదుపులో పెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News October 3, 2025
368 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

దేశంలోని అన్ని రైల్వే జోన్లలో 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. డిగ్రీ పాసై, 20-33 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఈ నెల 14 వరకు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్ సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, దివ్యాంగులకు రూ.250. ఆన్‌లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <