News October 3, 2025
MDK: ఎన్నికలు.. ఖర్చు పెట్టే వారికే టికెట్లు?

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు జరిగే ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 9న విడుదల చేయనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ఖర్చు పెట్టుకుంటామని ముందుకు వచ్చే వారికే టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. దీనిపై మీ కామెంట్.
Similar News
News October 3, 2025
HYDలో కొత్త లగ్జరీ హబ్.. కమల్ లైఫ్ స్టైల్ హౌస్

హైటెక్ సిటీలో కమల్ వాచ్ కో కొత్తగా ఏర్పాటుచేసిన కమల్ లైఫ్ స్టైల్ హౌస్‌ను బాలీవుడ్ నటి మౌని రాయ్ ఘనంగా ప్రారంభించారు. ఈ స్టోర్లో 50కి పైగా ప్రీమియం వాచ్ బ్రాండ్లు, బంగారు-వెండి ఆభరణాలు అమ్మే క్యారెట్ లేన్, స్వరోవ్స్కి జ్యువెలరీ, అంతర్జాతీయ సుగంధద్రవ్యాలతో వినియోగదారులకు ప్రత్యేక వ్యక్తిగత లగ్జరీ షాపింగ్ అనుభవం అందుతోందని నిర్వాహకులు తెలిపారు. లగ్జరీ రిటైల్ ప్రపంచంలో కొత్త శకానికి నాంది అని అన్నారు.

‘కర్రల సమరంలో చనిపోయిన ఈ వ్యక్తిని గుర్తిస్తే చెప్పండి’

కర్నూలు(D) దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో జరిగిన కర్రల సమరంలో మృతుల సంఖ్య 4కు చేరింది. మృతుల్లో ముగ్గురిని.. ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన తిమ్మప్ప, ఆలూరుకు చెందిన నాగరాజు, కర్ణాటకకు చెందిన బసవరాజుగా పోలీసులు గుర్తించారు. నాలుగో వ్యక్తి ఎడమ చేతిపై NBK అని పచ్చబొట్టు ఉందని, బంధువులు కానీ, మిత్రులు కానీ గుర్తిస్తే హొళగుంద ఎస్ఐ 91211 01161, ఆలూరు సీఐ 91211 01157 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.