News October 3, 2025
TTD ఆన్‌లైన్ అడ్వాన్స్ బుకింగ్‌లో మార్పులు..!

తిరుమల అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఈవో శుక్రవారం జరిగింది. ప్రస్తుతం 3నెలల ముందు ఆన్‌లైన్‌లో దర్శన టికెట్ల విడుదల చేస్తుండగా ఈ విధానాన్ని మార్చాలని పలువురు భక్తులు కోరారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. 3నెలల అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌లో మార్పులకు ప్రయత్నిస్తామన్నారు. నెల రోజుల ముందే టికెట్లు విడుదల చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి TTD బోర్డు నిర్ణయయం ఎలా ఉంటుందో?
Similar News
News October 3, 2025
HYDలో కొత్త లగ్జరీ హబ్.. కమల్ లైఫ్ స్టైల్ హౌస్

హైటెక్ సిటీలో కమల్ వాచ్ కో కొత్తగా ఏర్పాటుచేసిన కమల్ లైఫ్ స్టైల్ హౌస్‌ను బాలీవుడ్ నటి మౌని రాయ్ ఘనంగా ప్రారంభించారు. ఈ స్టోర్లో 50కి పైగా ప్రీమియం వాచ్ బ్రాండ్లు, బంగారు-వెండి ఆభరణాలు అమ్మే క్యారెట్ లేన్, స్వరోవ్స్కి జ్యువెలరీ, అంతర్జాతీయ సుగంధద్రవ్యాలతో వినియోగదారులకు ప్రత్యేక వ్యక్తిగత లగ్జరీ షాపింగ్ అనుభవం అందుతోందని నిర్వాహకులు తెలిపారు. లగ్జరీ రిటైల్ ప్రపంచంలో కొత్త శకానికి నాంది అని అన్నారు.

‘కర్రల సమరంలో చనిపోయిన ఈ వ్యక్తిని గుర్తిస్తే చెప్పండి’

కర్నూలు(D) దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో జరిగిన కర్రల సమరంలో మృతుల సంఖ్య 4కు చేరింది. మృతుల్లో ముగ్గురిని.. ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన తిమ్మప్ప, ఆలూరుకు చెందిన నాగరాజు, కర్ణాటకకు చెందిన బసవరాజుగా పోలీసులు గుర్తించారు. నాలుగో వ్యక్తి ఎడమ చేతిపై NBK అని పచ్చబొట్టు ఉందని, బంధువులు కానీ, మిత్రులు కానీ గుర్తిస్తే హొళగుంద ఎస్ఐ 91211 01161, ఆలూరు సీఐ 91211 01157 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.