News October 3, 2025
NLG: ఎస్టీ ఓట్లే లేవు.. రిజర్వేషన్ మాత్రం వారికే..!

అనుముల (M) పేరూరు పంచాయతీలో ఎస్టీ జనాభాయే లేదు. కానీ ప్రభుత్వం ఆ పంచాయతీని ఎస్టీ మహిళకు రిజర్వు చేయడంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇక్కడ మొత్తం 792 మంది ఓటర్లున్నారు. అందులో 421 మంది మహిళలు, 371 మంది పురుషులు. వీరిలో 665 మంది బీసీ ఓటర్లు కాగా, 107 మంది ఎస్సీలు, 20 మంది ఓసీ ఓటర్లు ఉన్నారు. అధికారులు ఎన్నికల జాబితాలో ఎక్కడా ఎస్టీ ఓట్లను చూపించలేదు. కానీ పంచాయతీని మాత్రం ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు.
Similar News
News October 3, 2025
బాణాసంచా విక్రయాలకు లైసెన్సులు తప్పనిసరి: డీఎస్పీ

చాగల్లు మండలంలో శుక్రవారం బాణాసంచా దుకాణాలను డీఎస్పీ దేవకుమార్ తనిఖీ చేశారు. లైసెన్సులు లేకుండా విక్రయాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బాణాసంచా తయారీ, నిల్వ చేసేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. షాపుల వద్ద ఎటువంటి అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నీరు, మంటలు ఆర్పే అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిబంధనలకు మేర పనిచేయాలన్నారు. ఎస్సై నరేంద్ర పాల్గొన్నారు.
News October 3, 2025
కుందేళ్ల పెరుగుదలకు మేలైన ఆహారం

పుట్టిన 12 రోజుల తర్వాత నుంచి కుందేలు పిల్లలు ఆహారం తింటాయి. కుందేళ్లకు గడ్డితో పాటు దాణాలో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ చెక్క, తవుడు, లవణ మిశ్రమాలు తగిన పరిమాణంలో కలిపి మేతగా అందించాలి. లూసర్న్, బెర్సీమ్, నేపియర్, పారాగడ్డి, వేరుశనగ, చిక్కుడు, సోయా, పిల్లిపెసర ఆకులను మేతలో కలిపి ఇవ్వవచ్చు. కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. నీటిని అందుబాటులో ఉంచాలి.
<<-se>>#RABBIT<<>>
News October 3, 2025
కొడంగల్: వక్ఫ్ బోర్డు మెంబర్ నివాసంలో సీఎం

సీఎం రేవంత్ రెడ్డి విజయదశమి పండుగను పురస్కరించుకొని శుక్రవారం కొడంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వక్ఫ్ బోర్డు మెంబర్ యూసుఫ్ నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు సీఎం హాజరయ్యారు. అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. సీఎంతో పాటు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, స్థానికులు ముస్తాక్, బషీర్, ఆసిఫ్‌ఖాన్ ఉన్నారు.