News October 3, 2025
KNR: పెరగనున్న మహిళా ప్రాతినిధ్యం..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేయడంతో మహిళల స్థానాలు విపరీతంగా పెరగనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 16,42,542 మహిళా ఓటర్లుండగా.. ఇందులో 30 ZPTC స్థానాలకు, 30 MPP స్థానాలకు, 323 MPTC స్థానాలకు, 615 గ్రామపంచాయతీలకు, 6,463 వార్డు సభ్యుల స్థానాలకు మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు సముచిత గౌరవం దక్కనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News October 3, 2025
భారీ వర్షాలకు నలుగురు మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం

AP: వర్షాలు, వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ₹4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని CM చంద్రబాబు ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్తును వెంటనే పునరుద్ధరించాలని చెప్పారు. వరదలపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో మరింత వరద పోటెత్తుతోందని వారు తెలిపారు. వానలతో నలుగురు మృతి చెందారన్నారు. పంట నష్టంపై నివేదికలివ్వాలని సూచించారు.
News October 3, 2025
వికారాబాద్‌లో విషాదం

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దురు బాలికలు మృతి చెందారు. ఈ ఘటన దుద్యాల మండలం అల్లికానిపల్లిలో జరిగింది. మృతులు వృక్షిత(15), ప్రణీత(16)గా స్థానికులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 3, 2025
నేను పార్టీ మారడం లేదు: పొన్నాల

TG: తాను బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఖండించారు. అదంతా అసత్య ప్రచారమేనని, బీఆర్ఎస్‌ను వీడేది లేదని Way2Newsకు తెలిపారు. పొన్నాలకు కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చిందని, దీంతో ఆయన మళ్లీ హస్తం గూటికి చేరనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొన్నాల కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలో చేరారు.