News October 3, 2025

మళ్లీ పెరగనున్న మొబైల్ టారిఫ్‌లు?

image

భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్‌లను 10-12 శాతం వరకు పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈక్రమంలో నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇప్పటికే 1GB ప్లాన్లను తొలగించారు. సరసమైన ప్లాన్లు కనిపించట్లేదు. డేటా ప్లాన్‌లను బలవంతంగా రుద్దుతున్నారు. ధరలు భారీగా పెరిగాయి. అయినా TRAI స్పందించట్లేదు’ అని నెటిజన్లు ఫైరవుతున్నారు. మీ కామెంట్?

Similar News

News October 3, 2025

భారీ వర్షాలకు నలుగురు మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం

image

AP: వర్షాలు, వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ₹4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని CM చంద్రబాబు ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్తును వెంటనే పునరుద్ధరించాలని చెప్పారు. వరదలపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో మరింత వరద పోటెత్తుతోందని వారు తెలిపారు. వానలతో నలుగురు మృతి చెందారన్నారు. పంట నష్టంపై నివేదికలివ్వాలని సూచించారు.

News October 3, 2025

నేను పార్టీ మారడం లేదు: పొన్నాల

image

TG: తాను బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఖండించారు. అదంతా అసత్య ప్రచారమేనని, బీఆర్ఎస్‌ను వీడేది లేదని Way2Newsకు తెలిపారు. పొన్నాలకు కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చిందని, దీంతో ఆయన మళ్లీ హస్తం గూటికి చేరనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొన్నాల కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలో చేరారు.

News October 3, 2025

కుందేళ్ల పెరుగుదలకు మేలైన ఆహారం

image

పుట్టిన 12 రోజుల తర్వాత నుంచి కుందేలు పిల్లలు ఆహారం తింటాయి. కుందేళ్లకు గడ్డితో పాటు దాణాలో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ చెక్క, తవుడు, లవణ మిశ్రమాలు తగిన పరిమాణంలో కలిపి మేతగా అందించాలి. లూసర్న్, బెర్సీమ్, నేపియర్, పారాగడ్డి, వేరుశనగ, చిక్కుడు, సోయా, పిల్లిపెసర ఆకులను మేతలో కలిపి ఇవ్వవచ్చు. కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. నీటిని అందుబాటులో ఉంచాలి.
<<-se>>#RABBIT<<>>