News October 3, 2025
తూ.గో జిల్లాకు 53 అవార్డులు: కలెక్టర్ కీర్తి

“స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఈనెల 6న స్థానిక ఆనం కళా కేంద్రంలో అవార్డులను అందజేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రా -స్వర్ణ ఆంధ్రాలో తూ.గో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులు లభించాయని తెలిపారు. ప్రజా ప్రతినిధుల, అధికారుల, సిబ్బంది కృషికి ఇది నిదర్శనం అని కలెక్టర్ అన్నారు.
Similar News
News October 3, 2025
రాజమండ్రి: ఆటో డ్రైవర్లకు రూ.17 కోట్ల 87 లక్షల ఆర్థిక సాయం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఆటో డ్రైవర్లు సేవలో” పథకం కింద తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 11,915 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారని జిల్లా రవాణా అధికారి సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.15,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మొత్తం రూ.17,87,25,000ల మేర ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
News October 3, 2025
రాజనగరం: ‘ఉమ్మడి జిల్లాలో నూతన ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం’

భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో బాధ్యతాయుతమైనదని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ నూతన్ ఉపాధ్యాయులకు విధుల నిర్వహణపై హితబోధ చేశారు. డీఎస్సీ 2025లో ఎంపికైన అభ్యర్థులకు జిల్లాలో 7 సెంటర్లలో శిక్షణ ఇచ్చే కార్యక్రమన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ ఐఎస్టీఎస్, బీవీసీ, రైట్, SM, SSP ఇంజినీరింగ్, జీఎస్ఎల్ డెంటల్-2 కాలేజీ సెంటర్లలో 1,672 మందికి శిక్షణ ఇస్తున్నారు.
News October 3, 2025
బాణాసంచా విక్రయాలకు లైసెన్సులు తప్పనిసరి: డీఎస్పీ

చాగల్లు మండలంలో శుక్రవారం బాణాసంచా దుకాణాలను డీఎస్పీ దేవకుమార్ తనిఖీ చేశారు. లైసెన్సులు లేకుండా విక్రయాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బాణాసంచా తయారీ, నిల్వ చేసేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. షాపుల వద్ద ఎటువంటి అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నీరు, మంటలు ఆర్పే అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిబంధనలకు మేర పనిచేయాలన్నారు. ఎస్సై నరేంద్ర పాల్గొన్నారు.