News October 3, 2025

KNR: ఒక్కరోజే రూ.16 కోట్ల మందు తాగేశారు..!

image

దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం ఏరులై పారింది. మొన్న ఒక్కరోజే సుమారు రూ.16 కోట్ల విలువగల మద్యాన్ని ప్రజలు తాగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దసరాకు ఒకరోజు ముందు ఐఎంఎల్ డిపో నుంచి రూ.16 కోట్ల లిక్కర్ లిఫ్ట్ కాగా.. సాయంత్రానికే దాదాపు అన్నీ వైన్ షాపుల్లో NO STOCK బోర్డులు దర్శనమిచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 14% అదనంగా అమ్మకాలు జరిగాయి.

Similar News

News October 3, 2025

పాడేరు: మీకోసం కార్యక్రమానికి 67 ఫిర్యాదులు

image

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 67 ఫిర్యాదులు అందాయి. జేసీ అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్‌తో కలిసి కలెక్టర్ దినేశ్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News October 3, 2025

భయభ్రాంతులకు గురికావద్దు: తిరుపతి SP

image

అపోహలు, ఊహాగానాలను నమ్మవద్దని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు శుక్రవారం తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో బాంబులు పెట్టినట్లు కొన్ని ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు అందుతున్నాయని అన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ మెయిల్స్ సమాచారంపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దన్నారు.

News October 3, 2025

విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు: మద్రాస్ HC

image

తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. టీవీకే చీఫ్ విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఘటన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఎక్కడికి వెళ్లారని, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. టీవీకే నేతల ముందస్తు బెయిల్ తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.