News October 3, 2025

రెండు దశల్లో బిహార్ ఎన్నికలు?

image

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న లేదా 7న నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఛఠ్ పండుగ తర్వాత అక్టోబర్ 31-నవంబర్ 2 మధ్య తొలి దశ ఎన్నికలు, 5-7 మధ్య రెండో దశ ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే నెల 10న ఫలితాలు రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ ఎన్నికలతో పాటు దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు బై పోల్స్ జరగనున్నాయి. ఇందులో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కూడా ఉంది.

Similar News

News October 3, 2025

ఈయన ఆస్తి రూ.44 లక్షల కోట్లు

image

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డ్ సాధించారు. నికర ఆస్తిలో $500 బిలియన్ మార్క్ దాటిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. టెస్లా, స్పేస్‌ఎక్స్, X వంటి సంస్థల మార్కెట్ విలువ అనూహ్యంగా పెరగడమే దీనికి కారణం. 2020లో ఆయన నెట్‌వర్త్ $24.6B ఉండగా ఐదేళ్లలోనే ఇది $500B (₹44.38లక్షల కోట్లు) చేరడం గమనార్హం. కాగా మస్క్ 2033 నాటికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలుస్తారని ఫోర్బ్స్ అంచనా వేసింది.

News October 3, 2025

అమరావతిలో పెట్టుబడులకు మలేషియా సంస్థల ఆసక్తి

image

AP: మలేషియా సెలంగోర్ EX CO మెంబర్ పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గణబతిరావ్, మలేషియా-ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. అమరావతిని రెండున్నరేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే CBN లక్ష్యమని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ₹10వేల కోట్లతో పలు ప్రాజెక్టుల ప్రతిపాదనల్ని ప్రతినిధులందించారు. అంతకు ముందు వారు అమరావతిలో పర్యటించారు.

News October 3, 2025

CSIR-IICTలో ఉద్యోగాలు

image

CSIR-IICT 7 సైంటిస్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 30వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. పోస్టును బట్టి పీహెచ్‌డీ, ఎంటెక్/ఎంఈ, ఎంఫిల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iict.res.in/CAREERS