News October 3, 2025

సెంటిమెంట్ ముందు అన్నీ బలాదూరే..

image

దసరా పండుగంటే చిన్నా, పెద్ద తేడాలేకుండా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. తెలంగాణలో పెద్ద పండుగైన దసరా, ఈసారి జాతిపిత గాంధీజీ జయంతి రోజు రావడంతో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. దసరా పండుగంటే గ్రామ దేవతల గద్దెల దగ్గర జంతు బలి ఇవ్వడం కొన్ని గ్రామాల్లో ఆనవాయితీ. అక్టోబరు 2వ తేది జంతువధ నిషేధం. ఇవన్నీ కూడా దసరా నాడు పక్కన బెట్టి తమ సెంటిమెంట్‌నూ ఉమ్మడి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కొనసాగించారు.

Similar News

News October 3, 2025

కేంద్రమంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

image

ప్రజలకు మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడం, పౌర సౌకర్యాలను మెరుగుపరచడంలో రక్షణ శాఖ భూములు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ యూజర్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ బకాయిలను క్లియర్ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని మంత్రి చెప్పారు.

News October 3, 2025

హైకోర్టు తీర్పు ప్రకారమే అనుమ‌తి పున‌రుద్ధ‌ర‌ణ

image

హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమ‌తుల్ని పున‌రుద్ధ‌రించామ‌ని హెచ్ఎండీఏ వెల్లడించింది. ఎలాంటి నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌న్నారు. 2022లో ఆదిత్య కేడియా మంచిరేవులో 9.19 ఎక‌రాల్లో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమ‌తిని జారీ చేసిందని చెప్పారు. కోర్టు తీర్పుతో పలు మార్పులు, పరిశీలనలు చేసి అనుమతులు పున‌రుద్ధ‌రించారు.