News October 3, 2025
ప్రాక్టికల్స్ కోసం వెళ్లి MBBS విద్యార్థిని సూసైడ్

నెల్లూరు మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్‌లో శుక్రవారం ఉదయం MBBS ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని <<17902198>>ఆత్మహత్య <<>>చేసుకుంది. మృతురాలు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంత జూటూరుకు చెందిన సంజీవ రాయుడు, లక్ష్మీదేవి కుమార్తె బన్నెల గీతాంజలిగా గుర్తించారు. ఇటీవల ఊరికి వచ్చిన ఆమె.. ప్రాక్టికల్స్ ఉండటంతో నిన్న కాలేజీకి వెళ్లింది. ఇవాళ ఆత్మహత్య చేసుకుంది.
Similar News
News October 3, 2025
ఈయన ఆస్తి రూ.44 లక్షల కోట్లు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డ్ సాధించారు. నికర ఆస్తిలో $500 బిలియన్ మార్క్ దాటిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. టెస్లా, స్పేస్‌ఎక్స్, X వంటి సంస్థల మార్కెట్ విలువ అనూహ్యంగా పెరగడమే దీనికి కారణం. 2020లో ఆయన నెట్‌వర్త్ $24.6B ఉండగా ఐదేళ్లలోనే ఇది $500B (₹44.38లక్షల కోట్లు) చేరడం గమనార్హం. కాగా మస్క్ 2033 నాటికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలుస్తారని ఫోర్బ్స్ అంచనా వేసింది.
News October 3, 2025
కేంద్రమంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

ప్రజలకు మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడం, పౌర సౌకర్యాలను మెరుగుపరచడంలో రక్షణ శాఖ భూములు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ యూజర్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ బకాయిలను క్లియర్ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని మంత్రి చెప్పారు.
News October 3, 2025
హైకోర్టు తీర్పు ప్రకారమే అనుమతి పునరుద్ధరణ

హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమతుల్ని పునరుద్ధరించామని హెచ్ఎండీఏ వెల్లడించింది. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. 2022లో ఆదిత్య కేడియా మంచిరేవులో 9.19 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతిని జారీ చేసిందని చెప్పారు. కోర్టు తీర్పుతో పలు మార్పులు, పరిశీలనలు చేసి అనుమతులు పునరుద్ధరించారు.