News October 3, 2025

భువనగిరి: మద్యం దుకాణాలకు ఎన్ని దరఖాస్తులంటే..

image

జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ సాగుతోంది. జిల్లాలో 82 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు .26వ తేదీ నుంచి నేటి వరకు 62 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం నాలుగు స్టేషన్లకు భువనగిరి 24, రామన్నపేట13, ఆలేరు 20, మోత్కూరు 10 వచ్చినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి తెలిపారు. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Similar News

News October 3, 2025

ALERT.. కాసేపట్లో వర్షం

image

TG: హైదరాబాద్, నగర పరిసర ప్రాంతాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఇప్పటికే ఆసిఫాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మీ జిల్లాల్లో వాన పడుతోందా? కామెంట్ చేయండి.

News October 3, 2025

కరాటే గిన్నిస్ రికార్డ్ పోటీలో పాల్గొననున్న జిల్లా మాస్టర్స్

image

ది వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5న చెన్నైలోని సెల్వన్ కాలేజీ మైదానంలో కరాటే గిన్నిస్ రికార్డ్ ఈవెంట్ జరగనుంది. ప్రపంచ కరాటే మాస్టర్‌లు పాల్గొనే ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మాస్టర్ మిట్టు దత్తు గెస్ట్‌గా, మాస్టర్ గాజుల జగన్నాథ ఋషి పార్టిసిపెంట్‌గా హాజరుకానున్నారు. ఆత్మరక్షణ ప్రదర్శనలో ప్రతిభ చూపిన వారికి మూడు వారాల్లో గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకొనున్నారు.

News October 3, 2025

విజయనగరం ఎస్పీతో ఎంపీ, ఎమ్మెల్యే భేటీ

image

విజయనగరం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ దామోదర్‌తో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు శుక్రవారం భేటీ అయ్యారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు గురించి ఈ సందర్భంగా చర్చించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని, భక్తుల దర్శనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. దొంగతనాలు జరగకుండా అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.