News October 3, 2025

‘ఐ లవ్ మోదీ’ అనొచ్చు.. ‘ఐ లవ్ మహమ్మద్’ అనకూడదా: ఒవైసీ

image

యూపీలోని బరేలీలో ‘<<17838405>>ఐ లవ్ మహమ్మద్<<>>’ అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ధ్వజమెత్తారు. దేశంలో ‘ఐ లవ్ మోదీ’ అంటే ఎలాంటి సమస్య ఉండదని, ‘ఐ లవ్ మహమ్మద్’ అంటే అభ్యంతరమా? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలతో దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారని నిలదీశారు. తాను మహమ్మద్ వల్లే ముస్లింగా ఉన్నానని పేర్కొన్నారు. దేశంలో 17 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారని తెలిపారు.

Similar News

News October 3, 2025

మహిళా ఖైదీలకు ‘అపూర్వ’ కానుక

image

క్షణికావేశంలో తప్పులు చేసి శిక్షలు అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు టీచర్‌గా మారారు అపూర్వ వివేక్. ఝార్ఖండ్ రాంచీకి చెందిన ఈమె 2013 నుంచి ఖైదీల సేవకే తన సమయాన్ని కేటాయించారు. న్యాయ సాయం అందించడమే కాకుండా వారికి, వారి పిల్లలకు చదువు చెబుతున్నారు. అలాగే వారిలో కుంగుబాటును నివారించడానికి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. బయటకు వచ్చిన వారికి పునరావాసం, ఉపాధి కల్పన కల్పిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

News October 3, 2025

ఈ మంత్రం జపిస్తే మీ వెంటే శివుడు

image

‘ఓం నమ:శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే పాపాలు తొలగి, ఆత్మశుద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఈ మంత్రం జపించిన వారికి శివుడు రక్షణగా ఉంటాడు. శరీరం పవిత్రంగా మారడానికి, జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు ఐదక్షరాలే మహా ద్వారం. రోజూ పఠిస్తే ఎంతో పుణ్యం’ అని పేర్కొంటున్నారు.
* రోజూ ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సమాచారం, ధర్మ సందేహాలకు సమాధానాల కోసం <<-se_10013>>‘భక్తి’ <<>>కేటగిరీకి వెళ్లండి.

News October 3, 2025

ఇథిహాసం క్విజ్ – 24 సమాధానాలు

image

1. రావణాసురుడు ‘పులస్త్య’ వంశానికి చెందినవాడు.
2. శ్రీరాముడు ‘నవమి’ తిథిన జన్మించాడు.
3. కర్ణుడిని రాధ, అధిరథుడు దత్తత తీసుకున్నారు.
4. క్షీర సాగర మథన సమయంలో ఉద్భవించిన అమృత కలశాన్ని విష్ణువు మోహినీ రూపంలో వచ్చి తీసుకున్నారు.
5. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున మనం ‘హోళీ’ జరుపుకొంటాం.
<<-se>>#mythologyquiz<<>>