News October 3, 2025

ఖమ్మం: కలిసొచ్చిన రిజర్వేషన్.. మళ్లీ ఆమే సర్పంచ్..

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు కొంతమందిని నిరాశ కలిగిస్తే మరికొంతమందికి కలిసొచ్చాయి. పెనుబల్లి మండలం గౌరవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక్క కుటుంబం మాత్రమే ఉంది. ఆ కుటుంబంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబంలోని మహిళ రుద్రజారాణి సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్లీ అదే రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ పదవి ఆమెకే దక్కనుంది.

Similar News

News October 3, 2025

MDK: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ శివారులోని ఒక పౌల్ట్రీ ఫారమ్‌లో పనిచేస్తున్న ఈశ్వరి (33) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈశ్వరిని భర్త నాగార్జుననే హత్య చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చేగుంట పోలీసులు భర్త నాగార్జునను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతురాలు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందినవారు.

News October 3, 2025

మహిళా ఖైదీలకు ‘అపూర్వ’ కానుక

image

క్షణికావేశంలో తప్పులు చేసి శిక్షలు అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు టీచర్‌గా మారారు అపూర్వ వివేక్. ఝార్ఖండ్ రాంచీకి చెందిన ఈమె 2013 నుంచి ఖైదీల సేవకే తన సమయాన్ని కేటాయించారు. న్యాయ సాయం అందించడమే కాకుండా వారికి, వారి పిల్లలకు చదువు చెబుతున్నారు. అలాగే వారిలో కుంగుబాటును నివారించడానికి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. బయటకు వచ్చిన వారికి పునరావాసం, ఉపాధి కల్పన కల్పిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

News October 3, 2025

ఈ మంత్రం జపిస్తే మీ వెంటే శివుడు

image

‘ఓం నమ:శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే పాపాలు తొలగి, ఆత్మశుద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఈ మంత్రం జపించిన వారికి శివుడు రక్షణగా ఉంటాడు. శరీరం పవిత్రంగా మారడానికి, జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు ఐదక్షరాలే మహా ద్వారం. రోజూ పఠిస్తే ఎంతో పుణ్యం’ అని పేర్కొంటున్నారు.
* రోజూ ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సమాచారం, ధర్మ సందేహాలకు సమాధానాల కోసం <<-se_10013>>‘భక్తి’ <<>>కేటగిరీకి వెళ్లండి.