News April 6, 2024

మహిళలకు ఏటా రూ.1,00,000: రాహుల్

image

TG: పేద మహిళలకు ఏటా రూ.లక్ష నేరుగా బ్యాంకులో వేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ హామీ ఇచ్చారు. ‘యువతకు ఏడాదికి రూ.లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తాం. విద్యావంతులైన యువకులకు సంవత్సరం పాటు నెలకు రూ.8,500 ఇస్తూ, శిక్షణ ఇప్పిస్తాం. ఇకపై దేశంలో ఏ కుటుంబానికీ ఏటా రూ.లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదు. మోదీ ప్రభుత్వం ధనవంతులకే రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు’ అని అన్నారు.

Similar News

News April 13, 2026

పసిబిడ్డకు పన్నెండు గంటల నిద్ర ఉండాల్సిందే..

image

ఏడాదిలోపు పసిపిల్లలకు రోజుకి 12-16 గంటలు నిద్ర అవసరం. రెండేళ్ల లోపువారైతే 8-14 గంటలు నిద్ర ఉండాలంటున్నారు నిపుణులు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎదగాలన్నా, శారీరక ఎదుగుదల బావుండాలన్నా పసిపిల్లలు రోజులో సగభాగం నిద్రలో ఉంటేనే మంచిది. సరిపోయినంతగా నిద్ర ఉంటే, ఎదిగిన తర్వాత వారిలో ఆలోచనాశక్తి, సమస్యను పరిష్కరించే నైపుణ్యం, జ్ఞాపకశక్తితోపాటు మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని పొందుతారని చెబుతున్నారు.

News April 13, 2026

కనకాంబరంలో పిండి నల్లి కట్టడి ఎలా?

image

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

News April 13, 2026

‘పన్నులు కట్టాలి, సలాం కొట్టాలి’ అనే విధానానికి మేము వ్యతిరేకం: CM

image

TG: NDA ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలోని కీలకశాఖల్లో ఏవీ సౌత్ స్టేట్స్‌కు ఇవ్వడం లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షను మరింత పెంచేలా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘పన్నులు కట్టాలి, సలాం కొట్టాలి’ అనే విధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మహిళా బిల్లును అడ్డుపెట్టుకొని డీలిమిటేషన్ చేయొద్దన్నారు.