News October 3, 2025

పిల్లలకు పేర్లు సూచిస్తూ రూ.లక్షల్లో సంపాదన

image

ట్రెండ్‌కు తగ్గట్లు పేరు పెట్టడం కత్తిమీద సామే. అందుకే అలాంటి పేర్లను వెతికి సూచించే ఓ జాబ్ ఉందనే విషయం మీకు తెలుసా? USAలో ‘బేబీ నేమర్’ అనే ప్రత్యేకమైన ఉద్యోగం ఉంది. టేలర్ A. హంఫ్రీ అనే మహిళ పదేళ్ల క్రితం సరదాగా ఈ వృత్తిని స్టార్ట్ చేసి 2020లో ఒక్కో క్లయింట్‌ నుంచి $1,500 వసూలు చేశారు. ప్రస్తుతం సంపన్నుల పిల్లలకు పేర్లు పెట్టి లక్షలు పొందుతున్నారు. ఇలా నెలకు $30K(రూ.26లక్షలు) సంపాదిస్తున్నారు.

Similar News

News October 3, 2025

టికెట్ల విడుదల కాలాన్ని తగ్గించడంపై త్వరలో నిర్ణయం: సింఘాల్

image

AP: మూడు నెలల ముందే శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తుండటంపై భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని TTD ఈవో అనిల్ సింఘాల్ అన్నారు. రైల్వే బుకింగ్ విధానాల్లో మార్పుల వల్ల దర్శనాలకు ఇబ్బంది కలుగుతోందని చెబుతున్నట్లు తెలిపారు. భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకొని, టికెట్ల విడుదల కాలాన్ని 15 రోజులు/నెల లేదా 45 రోజులు/2 నెలలకు కుదించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

News October 3, 2025

రెండేళ్లలోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దు: కేంద్రం

image

రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు వాడొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఇటీవల MP, MHలో కాఫ్ సిరప్ వల్ల 11మంది పిల్లలు మరణించారు. MPలోని ఛింద్వారా జిల్లాలోనే 9మంది చనిపోయారు. వీరిలో ఐదుగురికి ‘Coldref’, ఒకరికి ‘Nextro’ సిరప్ తాగించినట్టు తేలింది. అయితే ఆయా సిరప్‌‌ల్లో కల్తీ లేదని తేలగా, వాటిల్లో వాడిన కెమికల్స్ వల్లే మరణాలు సంభవించొచ్చని కేంద్రం అనుమానిస్తోంది.

News October 3, 2025

రాజధానికి భూసేకరణ.. క్యాబినెట్ కీలక నిర్ణయం

image

AP: రాజధాని అమరావతికి భూ సేకరణ విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. అలాగే కేంద్రం అమలు చేస్తున్న పూర్వోదయ స్కీమ్ ద్వారా రాష్ట్రానికి రూ.65,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పశువుల హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.