News October 3, 2025
సారీ మమ్మీ బతకాలని లేదు: ఇట్లు నీ పింకీ

TG: పెదనాన్న వేధింపులు తాళలేక మేడ్చల్(D) కొంపల్లిలో అంజలి(17) ఆత్మహత్య చేసుకున్నారు. ‘అమ్మా నన్ను క్షమించు. బతకాలని లేదు. నాన్న చనిపోయాక పెదనాన్న ప్రతివారం గొడవకు వస్తున్నాడు. నాకు అవమానంగా ఉంది. మనల్ని ప్రశాంతంగా బతకనివ్వడు. ఫైనాన్స్ ఇప్పించి తానే నాన్నను చంపానని నాతో అన్నాడు. పెదనాన్నకు కచ్చితంగా శిక్ష పడాలి. సారీ మమ్మీ. ఇట్లు నీ పింకీ’ అని ఆమె సూసైడ్ నోట్ రాశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 3, 2025
టికెట్ల విడుదల కాలాన్ని తగ్గించడంపై త్వరలో నిర్ణయం: సింఘాల్

AP: మూడు నెలల ముందే శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తుండటంపై భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని TTD ఈవో అనిల్ సింఘాల్ అన్నారు. రైల్వే బుకింగ్ విధానాల్లో మార్పుల వల్ల దర్శనాలకు ఇబ్బంది కలుగుతోందని చెబుతున్నట్లు తెలిపారు. భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకొని, టికెట్ల విడుదల కాలాన్ని 15 రోజులు/నెల లేదా 45 రోజులు/2 నెలలకు కుదించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
News October 3, 2025
రెండేళ్లలోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దు: కేంద్రం

రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు వాడొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఇటీవల MP, MHలో కాఫ్ సిరప్ వల్ల 11మంది పిల్లలు మరణించారు. MPలోని ఛింద్వారా జిల్లాలోనే 9మంది చనిపోయారు. వీరిలో ఐదుగురికి ‘Coldref’, ఒకరికి ‘Nextro’ సిరప్ తాగించినట్టు తేలింది. అయితే ఆయా సిరప్‌ల్లో కల్తీ లేదని తేలగా, వాటిల్లో వాడిన కెమికల్స్ వల్లే మరణాలు సంభవించొచ్చని కేంద్రం అనుమానిస్తోంది.
News October 3, 2025
రాజధానికి భూసేకరణ.. క్యాబినెట్ కీలక నిర్ణయం

AP: రాజధాని అమరావతికి భూ సేకరణ విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. అలాగే కేంద్రం అమలు చేస్తున్న పూర్వోదయ స్కీమ్ ద్వారా రాష్ట్రానికి రూ.65,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పశువుల హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.