News October 3, 2025
డ్రైవర్ల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సహాయం: కలెక్టర్

ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు ఈ నెల 4వ తేదీన వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ప్రతి సంవత్సరం రూ.15,000 ఆర్థిక సహాయం అందుతుంది. కోనసీమ జిల్లాలో 7,709 మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు.
Similar News
News October 3, 2025
క్యారవాన్ టూరిజన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు: కలెక్టర్

జిల్లాకు వచ్చే పర్యాటకులు అద్భుతమైన అనుభూతి పొందేలా చర్యలు తీసుకుంటామని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో క్యారవాన్ బస్సును పరిశీలించారు. పర్యాటక రంగ అభివృద్ధి దిశగా క్యారవాన్ టూరిజం రానున్న రోజుల్లో నూతన వరవడిని చూపుతుందన్నారు. క్యారవాన్ టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ బస్సు సూర్యలంక బీచ్‌లో శని, ఆదివారం అందుబాటులో ఉంటుందన్నారు.
News October 3, 2025
నర్సంపేట ఘటనపై విచారణ కొనసాగుతోంది: సీపీ

నర్సంపేట పట్టణ కేంద్రంలో గాంధీ జయంతి వేళ సీఐ సమక్షంలో జంతు బలి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. గురువారం సాయంత్రం వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం జరుగగా పోలీసులు బందోబస్తు కోసం వెళ్లిన సమయంలో జంతు బలి జరిగింది.
News October 3, 2025
టాప్-50 రెస్టారెంట్స్.. HYDలో తినలేదా ఏంటి?

జొమాటో రూపొందించిన ‘కాండే నాస్ట్ IND’ టాప్-50 రెస్టారెంట్ జాబితాలో ముంబై నుంచి 13, బెంగళూరు, ఢిల్లీ నుంచి 9 చొప్పున చోటు దక్కించుకున్నాయి. టాప్-4లో ముంబైలోని ది టేబుల్, MASQUE, PAPA’S, ది బాంబే క్యాంటీన్ ఉన్నాయి. అయితే బిర్యానీ, ఇతర రుచులకు పేరుగాంచిన HYD నుంచి ఒక్క రెస్టారెంట్‌కూ చోటు దక్కకపోవడంపై విమర్శలొస్తున్నాయి. HYDలో తినకుండానే లిస్టు ప్రిపేర్ చేశారేమోనని పలువురు సెటైర్లు వేస్తున్నారు.