News October 3, 2025

368 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

దేశంలోని అన్ని రైల్వే జోన్లలో 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. డిగ్రీ పాసై, 20-33 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఈ నెల 14 వరకు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్ సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, దివ్యాంగులకు రూ.250. ఆన్‌లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://www.rrbapply.gov.in/<<>>

Similar News

News October 3, 2025

టాప్-50 రెస్టారెంట్స్.. HYDలో తినలేదా ఏంటి?

image

జొమాటో రూపొందించిన ‘కాండే నాస్ట్ IND’ టాప్-50 రెస్టారెంట్ జాబితాలో ముంబై నుంచి 13, బెంగళూరు, ఢిల్లీ నుంచి 9 చొప్పున చోటు దక్కించుకున్నాయి. టాప్-4లో ముంబైలోని ది టేబుల్, MASQUE, PAPA’S, ది బాంబే క్యాంటీన్ ఉన్నాయి. అయితే బిర్యానీ, ఇతర రుచులకు పేరుగాంచిన HYD నుంచి ఒక్క రెస్టారెంట్‌‌కూ చోటు దక్కకపోవడంపై విమర్శలొస్తున్నాయి. HYDలో తినకుండానే లిస్టు ప్రిపేర్ చేశారేమోనని పలువురు సెటైర్లు వేస్తున్నారు.

News October 3, 2025

టికెట్ల విడుదల కాలాన్ని తగ్గించడంపై త్వరలో నిర్ణయం: సింఘాల్

image

AP: మూడు నెలల ముందే శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తుండటంపై భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని TTD ఈవో అనిల్ సింఘాల్ అన్నారు. రైల్వే బుకింగ్ విధానాల్లో మార్పుల వల్ల దర్శనాలకు ఇబ్బంది కలుగుతోందని చెబుతున్నట్లు తెలిపారు. భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకొని, టికెట్ల విడుదల కాలాన్ని 15 రోజులు/నెల లేదా 45 రోజులు/2 నెలలకు కుదించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

News October 3, 2025

రెండేళ్లలోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దు: కేంద్రం

image

రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు వాడొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఇటీవల MP, MHలో కాఫ్ సిరప్ వల్ల 11మంది పిల్లలు మరణించారు. MPలోని ఛింద్వారా జిల్లాలోనే 9మంది చనిపోయారు. వీరిలో ఐదుగురికి ‘Coldref’, ఒకరికి ‘Nextro’ సిరప్ తాగించినట్టు తేలింది. అయితే ఆయా సిరప్‌‌ల్లో కల్తీ లేదని తేలగా, వాటిల్లో వాడిన కెమికల్స్ వల్లే మరణాలు సంభవించొచ్చని కేంద్రం అనుమానిస్తోంది.