News October 3, 2025
646 ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC)లో 646 ఉద్యోగాలకు(కాంట్రాక్ట్) నోటిఫికేషన్ వెలువడింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నోయిడా, పుణే తదితర బ్రాంచ్‌లలో మేనేజర్, ప్రాజెక్ట్ అసోసియేట్, ఇతర పోస్టులున్నాయి. జాబ్‌ను బట్టి B.Tech/B.E, M.E/M.Tech, MCA, M.Phil/Ph.D చేసిన వారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ OCT 20. వెబ్‌సైట్: <
Similar News
News October 3, 2025
‘శ్వేతనాగు’ సినిమా రచయిత కన్నుమూత

ప్రముఖ రచయిత లల్లా దేవి (82) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా నిమ్మగడ్డవారిపాలెం గ్రామానికి చెందిన ఆయన అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు. ‘లల్లా దేవి’ పేరిట కథలు, నవలలు రాశారు. దివంగత నటి సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ‘శ్వేతనాగు’ సినిమాకు కథ అందించారు. 150కి పైగా నవలలు, నాటకాలు రచించారు. వాటిలో ఆమ్రపాలి, మహామంత్రి తిమ్మరుసు వంటి నవలలు పాపులర్ అయ్యాయి.
News October 3, 2025
అనిల్ అంబానీ పిటిషన్‌ను కొట్టేసిన బాంబే హైకోర్టు

తన కంపెనీ అకౌంట్లను ‘ఫ్రాడ్’గా వర్గీకరిస్తూ SBI ఇచ్చిన ఆర్డర్‌ను కొట్టేయాలని Reliance(ADA)Group ఛైర్మన్ అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంటు, అంతర్గత విధానాలపై RBI ఆదేశాల ప్రకారం అనిల్ కంపెనీ అకౌంట్లను బ్యాంకు జూన్‌లో ఫ్రాడ్‌గా పేర్కొంది. అయితే ముందుగా తన వాదనలను వినలేదని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని అనిల్ తరఫు లాయర్లు వాదించారు.
News October 3, 2025
4 ని.ల Zoom కాల్‌తో ఉద్యోగులకు ఉద్వాసన

INDIAN ఉద్యోగులకు 4ని.ల జూమ్ కాల్‌తో ఉద్వాసన పలికిందో US కంపెనీ. ఉన్నపళంగా రోడ్డున పడి వారు లబోదిబోమంటున్నారు. దీనిపై ఓ ఉద్యోగి పెట్టిన పోస్టు వైరలవుతోంది. ‘ఎప్పటి మాదిరిగానే సిస్టమ్‌లో లాగిన్ అయ్యా. 11గం.లకు COO జూమ్ కాల్ చేసి రీస్ట్రక్చరింగ్‌లో ఇండియన్ వర్క్‌ఫోర్స్‌ను తొలగిస్తున్నాం అని ప్రకటించారు. ఇంకే మాటల్లేకుండా కాల్ కట్ చేశారు’ అని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులంతా షాక్‌కు గురయ్యారు.