News October 3, 2025
విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు: మద్రాస్ HC

తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. టీవీకే చీఫ్ విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఘటన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఎక్కడికి వెళ్లారని, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. టీవీకే నేతల ముందస్తు బెయిల్ తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.
Similar News
News October 3, 2025
యుద్ధాన్ని ముగించకపోతే హమాస్‌కు నరకమే: ట్రంప్

ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగించాలని హమాస్‌కు US ప్రెసిడెంట్ ట్రంప్ గడువు విధించారు. ఆదివారంలోగా దీనిపై ఒప్పందం చేసుకోకపోతే హమాస్‌కు నరకం అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ‘హమాస్ చాలా ఏళ్లుగా మిడిల్ ఈస్ట్‌లో హింసాత్మక ముప్పుగా ఉంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో మారణహోమం సృష్టించింది. ఆ దాడికి ప్రతీకారంగా ఇప్పటివరకు 25,000+ హమాస్ సైనికులు హతమయ్యారు’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
News October 3, 2025
‘Snapchat’ వాడుతున్నారా?

ప్రస్తుతం యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ‘Snapchat’ యాప్‌లోనూ ఆంక్షలు మొదలయ్యాయి. వినియోగదారులు సేవ్ చేసిన మీడియా(మెమొరీస్) డేటాను కుదించింది. ఇకపై 5GB కంటే ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవాలంటే, తప్పనిసరిగా డబ్బు చెల్లించాలి. 100GB కోసం నెలకు $1.99 నుంచి చెల్లింపు ప్లాన్‌లు మొదలవుతాయి. లేదా నెలకు $3.99 చెల్లిస్తే 250GB లభిస్తుంది. ఈ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.
News October 3, 2025
‘నాసా’ ఆపరేషన్స్ నిలిపివేత.. కారణమిదే!

ప్రభుత్వ నిధుల లోపం కారణంగా తమ ఆపరేషన్స్‌ను నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు ఏజెన్సీని మూసివేస్తున్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది. అక్కడి కాంగ్రెస్ కొత్త బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం <<17882827>>షట్‌డౌన్<<>> అయిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ షట్‌డౌన్ కారణంగా ISS, స్పేస్‌క్రాఫ్ట్ వంటి క్రిటికల్ ఆపరేషన్స్ మినహా మిగతా ప్రాజెక్టులను నాసా నిలిపివేసింది.