News October 3, 2025

పాడేరు: మీకోసం కార్యక్రమానికి 67 ఫిర్యాదులు

image

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 67 ఫిర్యాదులు అందాయి. జేసీ అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్‌తో కలిసి కలెక్టర్ దినేశ్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News October 3, 2025

రాయపర్తి: సన్నూరు మాజీ సర్పంచ్ కన్నుమూత

image

రాయపర్తి (M) ఉమ్మడి సన్నూరు గ్రామానికి సుదీర్ఘకాలం పాటు(13ఏళ్లు) సర్పంచిగా సేవలందించిన కుందూరు భీష్మారెడ్డి (74) శుక్రవారం సాయంత్రం తన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు. వెంకటేశ్వరపల్లి, జయరాంతండా(S),బాలు నాయక్ తండాలతో కూడిన సన్నూరు ఉమ్మడి గ్రామానికి 1990-2003 వరకు రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా, 3 ఏళ్లపాటు గ్రామ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై పరిపాలన సాగించారు.

News October 3, 2025

హనుమకొండ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు శుక్రవారం సాయంత్రం హనుమకొండలోని ప్రైవేట్ దవాఖానలో మృతి చెందాడు.రాయపర్తి(M)పన్యానాయక్ తండాకు చెందిన నునావత్ కిషన్ నాయక్ కుమారుడైన నునావత్ గణేశ్(17) HYDలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన గణేశ్ ఈనెల1న తమ బైక్ పై కిష్టాపురం క్రాస్ రోడ్డుకు వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి జారిపడి గాయపడ్డాడు. దవాఖానలో మృతిచెందాడు.

News October 3, 2025

HYDకు‌ క్యూ కట్టారు.. భారీగా ట్రాఫిక్ జామ్

image

దసరా పండుగ ముగియడంతో సొంతూరు వెళ్లిన జనం నగరానికి క్యూ కట్టారు. ఈ క్రమంలో HYD-విజయవాడ హైవే మీద భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. చిట్యాల టోల్‌గేట్ వద్ద కిలో మీటర్ మేర వాహనాల కదలిక మందగించింది. ORR నుంచి హయత్‌నగర్‌ మీదుగా ఎల్బీనగర్‌ రూట్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. బోడుప్పల్, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్‌ రూట్‌లోనూ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.