News October 3, 2025

మల్కాజ్గిరి: అంగన్వాడీ టీచర్ల చీరల పంపిణీ ఇంకెప్పుడు.?

image

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు మేడ్చల్ జిల్లా పరిధిలోని సిబ్బందికి పంపిణీ చేయలేదు. డ్రెస్ కోడ్ సంబంధించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. చీరల పంపిణీ వేగవంతం చేయాలని, అంగన్వాడీ టీచర్లు కోరుతున్నారు.

Similar News

News October 3, 2025

NTR: 9,452 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రేపే నగదు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ నూతన పథకాన్ని శనివారం విజయవాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా 9,452 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న డ్రైవర్ల వివరాలను అధికారులు పరిశీలించి, అప్లికేషన్లను మంజూరు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందనుంది.

News October 3, 2025

కృష్ణా: 11,316 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రేపే నగదు

image

‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ద్వారా కృష్ణా జిల్లాలో 11,316 మంది ఆటో, టాక్సీ డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు. ఒకొక్క లబ్ధిదారునికి రూ.15వేలు చొప్పున రూ.16 కోట్ల 97లక్షల 40 వేలు బ్యాంక్ ఖాతాల్లో శనివారం జమ కానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఒకొక్కరికి రూ.10 వేలు చొప్పున ఇవ్వగా కూటమి ప్రభుత్వం రూ.15 వేలు ఆర్థిక సాయాన్ని ఇస్తుండటం పట్ల ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News October 3, 2025

గుంటూరులో ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే’లో ఎస్పీ

image

SP వకుల్ జిందాల్ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే’లో పాల్గొన్నారు. ఐదుగురు పోలీస్ సిబ్బంది తమ బదిలీ, సర్వీస్ సంబంధిత సమస్యలపై వినతి పత్రాలను SPకి సమర్పించారు. SP వాటిని సానుకూలంగా స్వీకరించి, సంబంధిత అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి, వారి వినతుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని SP పేర్కొన్నారు.