News October 3, 2025
కేంద్రమంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

ప్రజలకు మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడం, పౌర సౌకర్యాలను మెరుగుపరచడంలో రక్షణ శాఖ భూములు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ యూజర్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ బకాయిలను క్లియర్ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని మంత్రి చెప్పారు.
Similar News
News October 3, 2025
MBNR: ఖర్చులకు డబ్బు ఇవ్వలేదని యువకుడి మృతి

ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని యువకుడు గడ్డి మందు తాగి మృతి చెందిన ఘటన మహమ్మదాబాద్ PS పరిధిలో చోటుచేసుకుంది. SI శేఖర్ రెడ్డి వివరాలు.. జానంపల్లికి చెందిన కొమ్ము అమరేందర్(23) తన ఖర్చులకు ఇంట్లో డబ్బులు అడగగా లేవు తర్వాత ఇస్తామని చెప్పగా.. మనస్తాపానికి గురై ఇంట్లో గడ్డి మందు తాగాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. తల్లి కొమ్ము రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదయినట్లు SI తెలిపారు.
News October 3, 2025
ముగిసిన జోగులాంబ ఆలయ పాలకమండలి పదవీకాలం

అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి పదవి కాలం ఈరోజటితో ముగిసింది. ఏడాది కాలంలో రెండు పర్యాయాలు దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు చేసిన ఘనత ఈ పాలకమండలికి మాత్రమే దక్కింది. తక్కువ సమయం కావడంతో పాలకమండలి అనేక సవాళ్లను అధిగమిస్తూ పరిపాలన సజావుగా సాగించింది. వీరి పదవి కాలంలో ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు.
News October 3, 2025
NTR: 9,452 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రేపే నగదు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ నూతన పథకాన్ని శనివారం విజయవాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 9,452 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న డ్రైవర్ల వివరాలను అధికారులు పరిశీలించి, అప్లికేషన్లను మంజూరు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందనుంది.