News October 3, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి

image

భారీ వర్షాలకు ఉత్తరాంధ్రలో నాగవళి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం,మన్యం జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు.ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News October 3, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓తెలంగాణ జాగృతి భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా వీరన్న
✓భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి
✓ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు: పినపాక తాహశీల్దార్
✓సారపాకలో దంచి కొట్టిన వర్షం
✓స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: BRS జిల్లా అధ్యక్షుడు రేగా
✓కార్మికుల సమ్మెపై ప్రభుత్వం స్పందించాలి: KVPS
✓భద్రాద్రి జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు: ఎంపీ
✓పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే

News October 3, 2025

VJA: 13న స్టెల్లా వాలీబాల్, బీచ్ వాలీబాల్ జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 13న విజయవాడలోని స్టెల్లా కళాశాలలో అండర్-19 వాలీబాల్, బీచ్ వాలీబాల్ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, అలాగే పాఠశాల HM సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తప్పనిసరిగా తీసుకుని రావాలన్నారు.

News October 3, 2025

జియాగూడ మేకల మండి ఆధునీకరణకు గ్రీన్ సిగ్నల్

image

జియాగూడ మేకల మండి ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అనుమతులు ఇచ్చింది. త్వరలోనే ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. సుమారుగా రోజు 6,000 మేకలను వధించే సామర్థ్యంతో నూతన భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. చెంగిచెర్లలోని కబేలాను కూడా ఆధునీకరించాలని అక్కడికి వెళుతున్న పలువురు వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.