News October 3, 2025
ఇతిహాసాల్లో ‘8’ సంఖ్య ప్రాముఖ్యత

ఇతిహాసాలు, పురాణాల్లో ‘8’ సంఖ్యకు విశేష స్థానం ఉంది. ఇది సృష్టిలోని సమగ్రతకు, పరిపూర్ణతకు ప్రతీక. మనకు అష్ట దిక్కులు ఉన్నాయి. ప్రకృతిని పాలించే అష్ట వసువులు ఉన్నారు. న్యాయాన్ని సూచించే త్రాసు దారాలు, శక్తికి నిదర్శనమైన శరభ మృగానికి కాళ్లు ఎనిమిదే. విఘ్నేశ్వరుని నామాలు కూడా ఎనిమిదే. ‘8’ సంఖ్య అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులతో ముడిపడి భక్తులకు శ్రేయస్సును, విజయ మార్గాన్ని సూచిస్తుంది. <<-se>>#Sankhya<<>>
Similar News
News October 3, 2025
విజయ్, రష్మిక ఎంగేజ్‌మెంట్ అయిందా?

విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పలువురు నెటిజన్లు వారికి విషెస్ తెలియజేస్తున్నారు. దీనిపై వారిద్దరి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నట్లు గతంలోనూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు.
News October 3, 2025
తాజా సినీ ముచ్చట్లు

☞ ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ డబ్బింగ్ ప్రారంభం
☞ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో విలన్‌గా షైన్ టామ్ చాకో?
☞ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మూవీకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్
☞ కొనసాగుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.. అక్టోబర్ 31న థియేటర్లలోకి
News October 3, 2025
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

APలో రేపు ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. అటు TGలో ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, HNK, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.