News October 3, 2025

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

AP: సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్, జలవనరుల, విద్యుత్ శాఖ పనులు, అమృత్ పథకం 2.0 పనులకు, ఆటో/క్యాబ్ డ్రైవర్లకు ₹15,000, అమరావతిలో SPV ఏర్పాటు, పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

Similar News

News October 3, 2025

రోహిత్, కోహ్లీ వచ్చేస్తున్నారు!

image

ఈనెల 19 నుంచి AUSతో జరగనున్న వన్డే సిరీస్‌కు రేపు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరూ వన్డేలు మినహా టెస్ట్, టీ20ల నుంచి రిటైరైన విషయం తెలిసిందే. దీంతో AUSతో మ్యాచులకు జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. చాలారోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్న ‘రోకో’ జోడీని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు కెప్టెన్‌గా రోహిత్‌ను కొనసాగిస్తారా లేక మరొకరికి ఛాన్స్ ఇస్తారా? అనేది చూడాలి.

News October 3, 2025

విజయ్, రష్మిక ఎంగేజ్‌మెంట్ అయిందా?

image

విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పలువురు నెటిజన్లు వారికి విషెస్ తెలియజేస్తున్నారు. దీనిపై వారిద్దరి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నట్లు గతంలోనూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు.

News October 3, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

☞ ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ డబ్బింగ్ ప్రారంభం
☞ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో విలన్‌గా షైన్ టామ్ చాకో?
☞ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మూవీకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్
☞ కొనసాగుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.. అక్టోబర్ 31న థియేటర్లలోకి