News October 3, 2025
ఈ మంత్రం జపిస్తే మీ వెంటే శివుడు

‘ఓం నమ:శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే పాపాలు తొలగి, ఆత్మశుద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఈ మంత్రం జపించిన వారికి శివుడు రక్షణగా ఉంటాడు. శరీరం పవిత్రంగా మారడానికి, జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు ఐదక్షరాలే మహా ద్వారం. రోజూ పఠిస్తే ఎంతో పుణ్యం’ అని పేర్కొంటున్నారు.
* రోజూ ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సమాచారం, ధర్మ సందేహాలకు సమాధానాల కోసం <<-se_10013>>‘భక్తి’ <<>>కేటగిరీకి వెళ్లండి.
Similar News
News October 3, 2025
రోహిత్, కోహ్లీ వచ్చేస్తున్నారు!

ఈనెల 19 నుంచి AUSతో జరగనున్న వన్డే సిరీస్‌కు రేపు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరూ వన్డేలు మినహా టెస్ట్, టీ20ల నుంచి రిటైరైన విషయం తెలిసిందే. దీంతో AUSతో మ్యాచులకు జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. చాలారోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్న ‘రోకో’ జోడీని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు కెప్టెన్‌గా రోహిత్‌ను కొనసాగిస్తారా లేక మరొకరికి ఛాన్స్ ఇస్తారా? అనేది చూడాలి.
News October 3, 2025
విజయ్, రష్మిక ఎంగేజ్‌మెంట్ అయిందా?

విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పలువురు నెటిజన్లు వారికి విషెస్ తెలియజేస్తున్నారు. దీనిపై వారిద్దరి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నట్లు గతంలోనూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు.
News October 3, 2025
తాజా సినీ ముచ్చట్లు

☞ ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ డబ్బింగ్ ప్రారంభం
☞ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో విలన్‌గా షైన్ టామ్ చాకో?
☞ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మూవీకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్
☞ కొనసాగుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.. అక్టోబర్ 31న థియేటర్లలోకి