News October 3, 2025
MDK: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ శివారులోని ఒక పౌల్ట్రీ ఫారమ్‌లో పనిచేస్తున్న ఈశ్వరి (33) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈశ్వరిని భర్త నాగార్జుననే హత్య చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చేగుంట పోలీసులు భర్త నాగార్జునను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతురాలు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందినవారు.
Similar News
News October 3, 2025
మహబూబాబాద్: భారీ ధర పలికిన అమ్మవారి చీర

మహబూబాబాద్ పట్టణంలోని మూడు కోట్లు సెంటర్ వద్ద జై భవాని యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో 5వ రోజు దుర్గామాత అమ్మవారి మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ అవతారంలో అమ్మవారు ధరించిన చీరను యూత్ కమిటీ సభ్యులు ఈరోజు వేలం పాట వేశారు. పద్మం ప్రవీణ్ కుమార్ దంపతులు రూ.2,50,202కు చీరను కైవసం చేసుకున్నారు.
News October 3, 2025
శ్రీకాళహస్తి నేతలకు ఊహించని షాక్

శ్రీకాళహస్తి ఆలయ బోర్డు <<17906968>>సభ్యత్వంపై <<>>ఆశపెట్టుకున్న లోకల్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బోర్డులో స్థానికులు ఆరుగురికే చోటు దక్కింది. మిగిలిన 11 మంది(మొత్తం 17మంది సభ్యులు) వేరే జిల్లాలకు చెందిన వాళ్లు ఉన్నారు. గత ప్రభుత్వంలో 80 శాతం లోకల్ వాళ్లు, 20 శాతం బయట వారికి బోర్డులో అవకాశం కల్పించారు. బోర్డు ఛైర్మన్‌గా జనసేన నేత కొట్టే సాయి నియమితులైన విషయం తెలిసిందే
News October 3, 2025
మానకొండూరు: మూడు కార్లను ఢీ కొట్టిన లారీ

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టేపల్లి శివారులో లారీ డ్రైవర్ అజాగ్రత్తతో భారీ ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ ముందున్న ఓ కారును ఢీ కొట్టి, అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్లు ధ్వంసమవగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.